Ntr sampathnandi aswani dutt new movie

ntr-sampathnandi- aswani dutt new movie

ntr-sampathnandi- aswani dutt new movie

15.gif

Posted: 04/16/2012 04:12 PM IST
Ntr sampathnandi aswani dutt new movie

               sampathఇటీవల విడుదలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 'రచ్చ' సినిమా దర్శకుడు సంపత్ నంది కి కమర్షియల్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చింది. ఈ నేపథ్యంలో పెద్ద హీరోల నుంచి సంపత్ కు పిలుపులొస్తున్నాయి. తాజాగా, సంపత్ టేకింగ్ స్టయిల్ నచ్చడంతో యన్టీఆర్ కూడా అతనితో ఓ చిత్రం చేయడానికి ముందుకొచ్చాడని తెలుస్తోంది. యన్టీఆర్ ఇమేజ్ కి తగ్గా కథను ఇప్పటికే సంపత్ రెడీ చేసాడట.
               వీరి కాంబినేషన్లో వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ ఈ ప్రాజక్టును చేబడుతున్నారని టాలీవుడ్ సమాచారం. ఆమధ్య యన్టీఆర్ తో ఆయన నిర్మించిన 'శక్తి' సినిమా ఫ్లాప్ కావడంతో ఇంతకు ముందు చెప్పినట్టుగానే యన్టీఆర్ మరోసారి అశ్వనీదత్ కు డేట్స్ ఇస్తున్నాడట.Shakti_aaaa
              ఇదిలా ఉంచితే, ఇప్పటికే ప్రభాస్ సంపత్ నందితో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడని వార్తలొచ్చాయి. సంపత్ చెప్పిన లైన్ ప్రభాస్ కి బాగా నచ్చిందట. దాంతో ఆ చిత్రానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  చరణ్ ఇచ్చిన సినిమా ఛాన్స్ తో ఒక్కసారిగా పెద్ద హీరోలు కోరుకునే స్థాయికి సంపత్ చేరిపోయాడు. ఆల్ ద బెస్ట్ సంపత్..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gundello godari producer lakshmi manchu fida abt hospitality in e and w godavari people
Enjilina joli and brad pitt engagement  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles