మెగా బ్రదర్స్ ముగ్గురూ చాలా కాలం తర్వాత ఒకే వేదిక పై పక్క పక్కనే కూర్చుని మరీ కనువిందు చేశారు. మెగా అభిమానులను విశేషంగా ఆకర్షించిన దానికి కారణం 'గబ్బర్ సింగ్' ఆడియో వేడుక. చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ ముగ్గురూ కలిసి వేడుకలోని కార్యక్రమాలను తిలకించారు.
హైదరాబాదులోని శిల్ప కళా వేదికలో ‘గబ్బర్ సింగ్’ ఆడియోను మెగాస్టార్ చిరు ఆవిష్కరించి పవర్ స్టార్ పవన్ కు అందించారు. అనంతరం మాట్లాడుతూ, తమ్ముడు పవన్ కల్యాణ్ ని అన్న చిరంజీవి ఈ రోజు ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడారు. "తమ్ముడు గురించి ఏం చెప్పుకోను... చిన్నప్పటి నుంచీ తను అందరిలోకీ డిఫరెంట్ గా ఉండేవాడు. అదే డిఫరెన్స్ ని ఈవేళ తన సినిమాల్లో కూడా చూపిస్తున్నాడు. తను నిజ జీవితంలో ఎలా ఉంటాడో, ఎలా ఆలోచిస్తాడో తన సినిమాల్లో కూడా అదే చూపిస్తాడు. సమాజానికి ఏదో చెప్పాలన్న తపన కనపడుతుంది. దేశభక్తి వుంటుంది. యువతకు దిశానిర్దేశం చేస్తాడు. చిన్నప్పటి నుంచీ అమ్మాయిల పట్ల ఈవ్ టీజింగ్ చేసే వాళ్లని అసహ్యించుకునేవాడు. అదే తన సినిమాల్లోనూ చూపిస్తున్నాడు. విలన్ తో ఫైట్ చేసేటప్పుడు కూడా అదే కసి కనపడుతుంది తనలో. తన ఒరిజినల్ క్యారెక్టర్నితెరమీద చూపిస్తాడు. నిజాయతీకి మారు పేరు పవన్" అన్నారు చిరంజీవి. ఇటీవల విడుదలైన రచ్చ ఒక రచ్చ అయితే, రేపు గబ్బర్ సింగ్ రచ్చ రచ్చ... పాటలన్నీ విన్నాను. ప్రతి పాటా బాగుంది. ఇప్పుడు విన్న 'కెవ్వు కేక' పాట నిజంగా కెవ్వు కేకే! ఇందాక విన్న 'దేఖో.. దేఖో' పాట చూస్తుంటే నాకు కూడా స్టేజ్ మీదకు వచ్చి డ్యాన్స్ చేయాలనిపించింది. కానీ, బాగుండదని ఆగిపోయాను... అక్కడికీ తట్టుకోలేక కూర్చున్న చోటే కాళ్ళు కదిపాను. రేపు దియేటర్లో ఇదంతా రచ్చ రచ్చే!" అన్నారు.
ఆ తర్వాత మాట్లాడిన పవన్ కల్యాణ్ రెండంటే రెండే ముక్కలు మాట్లాడి అభిమానుల్ని నిరాశపరిచాడనే చెప్పాలి. వినోదాన్ని పంచడం కోసం శాయశక్తులా కృషి చేస్తానని పవన్ అన్నారు. అంతకు ముందు మాట్లడిన నిర్మాత బండ్ల గణేష్, దర్శకుడు హరీష్ శంకర్ పవన్ ను ఆకాశానికి ఎత్తేశారు. నాకు పవన్ కళ్యాణ్ తో ఎప్పటినుంచో సినిమా తీయాలని ఉందని ఆ అవకాశం త్వరలో కల్పించాలని శ్రీను వైట్ల పవన్ కళ్యాణ్ ను కోరటం అందరినీ ఆనందానికి గురిచేసింది.
ఈ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ చేసిన పెర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది. శృతి హాసన్, అల్లు అర్జున్, బ్రహ్మానందం, అలీ, హరీష్ శంకర్, ఇంకా పలువురు దర్శకులు, నిర్మాతలు, వేలాదిగా మెగా అభిమానులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more