A film on tarachowdary

a film on tarachowdary

a film on tarachowdary

1111.gif

Posted: 04/15/2012 08:22 PM IST
A film on tarachowdary

             tara_222 సంచలనం కలిగిస్తూ అటు రాజకీయ, సినీ వర్గాల్లో గుబులు పుట్టిస్తోన్న తారా చౌదరి వ్యవహారం.  వ్యభిచారం కేసులో జైలుపాలైన సదరు సినీనటి తారాచౌదరి జీవిత చరిత్రపై సినిమాలు తీసేందుకు నిర్మాతలు ఎగబడుతున్నారు. తారా కథను తెరకెక్కించడానికి ఫిలింనగర్‌లో అప్పుడే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రెండురోజుల వ్యవధిలో తారాచౌదరి జీవితంపై తీసే సినిమా కథకు సంబంధించి ఎనిమిది టైటిళ్లు నమోదు చేశారు. రోజుకు నాలుగు సినిమా టైటిళ్లు తారాచౌదరి జీవితంపై నమోదవుతున్నాయని ఫిలింనగర్ టాక్.
            ఇప్పటికే తారాజువ్వ, తారావిలాసం, తారాతోరణం, ఒంపుసొంపుల వయ్యారి, కెమెరారాణి పేరుతో టైటిళ్లు నమోదైనట్టు సమాచారం. ఎవరు ముందు సినిమా మొదలుపెడితే వారిదే తార జీవిత చరిత్రపై సినిమా అవుతుందని చాలామంది తొందరపడుతున్నట్లు కూడా సమాచారం. ఓ అగ్రనిర్మాత ఆమె జీవితంపై సినిమా తీసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. డర్టీ పిక్చర్ సూపర్ హిట్ అవటంతో ఈ తరహా సినిమాలకు క్రేజీ బాగా పెరిగిపోయింది ఇప్పుడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Power star pawan kalyan movie gabbar singh movie audio launch
Power star pawan kalyan gabbar singh audio release today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles