Nenu kerchief vesina ammai joliki vaste da da da daruve

nenu kerchief vesina ammai joliki vaste da da da daruve

nenu kerchief vesina ammai joliki vaste da da da daruve

1.gif

Posted: 04/12/2012 12:54 PM IST
Nenu kerchief vesina ammai joliki vaste da da da daruve

            Daruvu-Movie-Posters నేను కర్చీఫ్ వేసిన అమ్మాయ్ జోలికి ఎవరైనా వస్తే ద..ద..ద..దరువే అంటున్నాడు మాస్ మహరాజ.  ఇది, రవితేజా - తాప్సీ జంటగా నటిస్తోన్న 'దరువు' చిత్రంలో తన లవర్ గురించి ప్రత్యర్థులకు చేసే హెచ్చరికే ఈ డైలాగ్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.  శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి శివ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ నెల 18 న భారీ ఎత్తున ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
             రవితేజా కి ఉన్న మాస్ ఇమేజ్ ని ఆయన బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ కథని రెడీ చేసుకోవడం జరిగిందని, రవితేజ కేరక్టర్ ని విభిన్నమైన షేడ్స్ లో ఆవిష్కరించడం జరిగిందనీ చెబుతున్న దర్శకుడు ఈ సినిమాను ఎలా రక్తి కట్టించబోతున్నాడో చూడాలి ఇక 'నిప్పు' ఫ్లాపులో ఉన్న రవితేజాకి, 'మొగుడు' పరాజయంతో ఉన్న తాప్సీకి ఈ సినిమా విజయం కీలకం కానుంది.  మే 4 వ తేదీన ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan tej hindi movie starts priyanka chopra is the heroine
Watch the nathalia kaurs dan dan song teaser  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles