Young hero daggubati rana injure in shooting today

young hero daggubati rana injure in shooting today

young hero daggubati rana injure in shooting today

19.gif

Posted: 04/11/2012 06:55 PM IST
Young hero daggubati rana injure in shooting today

             rana-innerఇటీవల కాలంలో తరచూ మన యువ హీరోలు గాయాలపాలవుతున్నారు. డూప్స్ లేకుండా యాక్షన్ దృశ్యాలలో పాల్గొంటున్నందువల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. ఇవాళ రానా దగ్గుబాటి కూడా ప్రమాదం బారిన పడ్డాడు.
             క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కృష్ణం వందే జగద్గురుం' చిత్రం షూటింగు హైదరాబాదులో జరుగుతుండగా ఆయన గాయపడ్డారు. ఒక బ్లాస్టింగ్ సన్నివేశంలో, హీరో రానా గాల్లోకి దూకవలసిన సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా హైదరాబాదులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో రానా ఎడమ చేతికి గాయమవడంతో వెంటనే ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు ట్రీట్ మెంట్ ఇస్తున్నారు.
               అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదనీ, రానా ఒక వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందనీ డాక్టర్లు చెప్పారు. ఇదే విషయాన్ని రానా కూడా ట్విట్టర్ ద్వారా సమాచారం అందించాడు. ‘రచ్చ’ సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ తేజ్ కూడా పలు మార్లు గాయపడ్డ సంగతి తెలిసిందే.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Watch the nathalia kaurs dan dan song teaser
Great actor kamal hassan as army general in viswaroopam movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles