అంకితభావంలో తండ్రి మోహన్ బాబుకు మించిన తనయుడు మంచు మనోజ్. ఇది ఇప్పటికి అనేక సందర్భాల్లో రూఢీ అయిందికూడా. సినిమాల్లో నటించేటప్పుడు మనోజ్ చాలా డెడికేషన్ తో పనిచేస్తారు. ప్రస్తుతం “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్న ఈ నటుడు జ్వరంతో బాధపడుతున్నా లెక్కచేయకుండా చిత్రీకరణలో పాల్గొన్నారు.
అంతేకాదు.. తీయాల్సిన సీన్స్ కండలు చూపించాల్సినవి కావటంతో నీళ్ళు తాగకూడదనే సలహా మేరకు మనోజ్ అంత జ్వరంలోనూ దాదాపుగా 22 గంటలు నీళ్ళు తాగకుండా గడిపారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు. ‘ ఇప్పుడే బేర్ బాడి సన్నివేశాలు చిత్రీకరణ పూర్తయ్యింది. దాదాపుగా 22 గంటల తరువాత నీళ్ళు తాగుతున్నాను. ఈ రోజు చిత్రీకరణ చాలా బాగుంది రేపు ప్రొద్దున ఆరు గంటల వరకు షూట్ జరుగనుంది.’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
మోహన్ బాబు కుమార్తె, మనోజ్ సోదరి లక్ష్మీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో బాల కృష్ణ మరియు దీక్ష సెత్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ రాజ దర్శకత్వం వహిస్తుండగా, బొబో శశి సంగీతం.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more