Amitab is the super starrajani

amitab is the super star..rajani

amitab is the super star..rajani

18.gif

Posted: 04/01/2012 06:43 PM IST
Amitab is the super starrajani

            Rajanikath-London1-4-12-38884 బిగ్ బి మీద తన అభిమానాన్ని మరోమారు బయటపెట్టారు సూపర్ స్టార్ రజనీ కాంత్. తన దృష్టిలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబచ్చన్ మాత్రమే సూపర్‌స్టార్ అని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. ‘‘నా వరకు అమితాబే సూపర్‌స్టార్ అన్నారు వినమ్రంగా రజనీ.
             ప్రతి సినిమాను మొదటి చిత్రంగానే భావిస్తా. దర్శకుడు, నిర్మాత ఎంపిక విషయంలో సెలెక్టివ్‌గా ఉంటాను’’ అని 61 ఏళ్ల రజనీ చెప్పారు. తనను సూపర్‌స్టార్‌గా పిలవడంపై ప్రశ్నించినప్పుడు రజనీ పైవిధంగా స్పందించారు. ‘కొచ్చడయాన్’ షూటింగ్ కోసం లండన్ లో ఉన్నారు. బెంట్లే హోటల్‌లో బసచేశారు. అనారోగ్యం నుంచి 90 శాతం కోలుకున్నానని చెప్పారు. ‘కొచ్చడయాన్’ ను దీపావళి కానుకగా నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు వెల్లడించారు.
            చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘కొచ్చడయాన్’ కు రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 21 ఏళ్ల తర్వాత ఈ సినిమా కోసం రజనీకాంత్ పాట పడడం విశేషం. రజనీ సరసన దీపికా పదుకునే, ఇతర పాత్రల్లో శోభన, శరత్‌కుమార్, నాజర్, ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ఈ చిత్రం మీద ప్రపంచవ్యాప్తంగా అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh audio launch in a different way
Femina miss india title goes to  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles