Film actress tara chowdary arrest

film actress, tara chowdary arrest

film actress tara chowdary arrest

4.gif

Posted: 04/01/2012 12:14 PM IST
Film actress tara chowdary arrest

            Tara_chowdary_arrested_in_prostitution_caseధనార్జన కోసం వక్రమార్గాలు చేపట్టిన ఓ తార అడ్డంగా దొరికిపోయింది.  వ్యభిచారం కేసులో సినీనటి తారాచౌదరి అలియాస్ మంజుల (35),  ఆమె భర్త ప్రసాద్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. మంజుల తనను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపిందంటూ వైజాగ్‌కు చెందిన లక్ష్మి అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ అరెస్ట్ లు జరిగాయి.
             బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ ఎం.సుదర్శన్, బాధితురాలు లక్ష్మి కథనం ప్రకారం అసలు విషయం ఇలాఉంది.   శ్రీనగర్‌కాలనీ సమీపంలోని నవోదయాకాలనీలో తారాచౌదరి గది అద్దెకు తీసుకుని వ్యభిచార గృహం నడుపుతోంది. ఏడాది క్రితం ఈమె విశాఖపట్నం గాజువాక లోని ఓ జ్యువెలరీ షాప్‌కు వెళ్లింది. అక్కడ సేల్స్‌గర్ల్‌గా పని చేస్తున్న లక్ష్మితో హైదరాబాద్ వస్తే మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికింది. దీంతో ఫిబ్రవరి 29న లక్ష్మి నగరానికి వచ్చి ఆమెను సంప్రదించగా ఇంటికి రమ్మంది. యువతి వెళ్లగా ఇద్దరు యువకులు నిన్ను కొనుక్కున్నాం...15 రోజులు మాతో గడపాలని నిర్బంధించారు. వ్యభిచారం చేయమని హింసించారని బాదితురాలు పోలీసులకు తన ఫిర్యాదులో ఆరోపించింది.            

           ఈ వ్యవహారం మీడియాకు పొక్కటంతో ఈ వ్యభిచార గట్టు రట్టయింది.  బాధితురాలు ఓ ఛానల్ సహాయంతో వ్యభిచార కూపం నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతలోనే తారాచౌదరి బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు వచ్చి.. తనపై ఓ ఛానల్ అసభ్యకరంగా స్క్రోలింగ్స్ ఇస్తోందని, చర్యలు తీసుకోవాలని పోలీసులపై చిందులేసి నానా హడావుడీ చేసింది.
            అయితే, బాధితురాలు లక్ష్మి ఫిర్యాదు మేరకు తారాచౌదరిని, ఆమె భర్త ప్రసాద్‌ను అరెస్ట్ చేసి ఐపీసీ 353, 3 అండ్ 4 ఆఫ్ పీటా యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అంతేగాక తమపై చిందులేసినందుకూ కేసు పెట్టారు. ఈమెపై గతంలో పంజగుట్ట పోలీసుస్టేషన్‌లో వ్యభిచారం కేసు, బంజారాహిల్స్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Femina miss india title goes to
Puri jagannath finalized for item girl abriela bertante  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles