Rana enter into hollywood also

rana ,enter into hollywood, also

rana enter into hollywood also

13.gif

Posted: 03/27/2012 07:11 PM IST
Rana enter into hollywood also

         rana_inner లేచిందే లేడికి పరుగు అన్నట్టుంది యువ హీరో దగ్గుబాటి రానా వ్యవహారం. ఇటీవలే తన సిక్స్ ప్యాక్ బాడీతో పోజులు ఇచ్చిన ఈ ఆజానుభాహుడు తెలుగు తెరనుంచి బాలీవుడ్ కూ వెళ్లి హల్ చల్ చేస్తున్నాడు. తాజాగా మరో మూడడుగులు ముందుకేసి ఏకంగా హాలీవుడ్ లోనే తెరంగేట్రం చేసేసేందుకు సన్నద్దమైపోతున్నాడు. 
           తానే 'లీడర్' నంటూ రంగంలోకి దిగిన ఇతగాడు  తాజాగా,  ఆదిత్య భట్టాచార్య దర్శకత్వంలో 'ఎ మెమొంటరీ లాప్స్ ఆఫ్ రీజన్' అనే హాలీవుడ్ సినిమా చేయడానికి అంగీకరించాడు. లాస్ ఏంజిల్స్ లో సెటిలైన ఓ ఇండియన్ బిజినెస్ మేన్, అక్కడ అండర్ వరల్డ్ మీద రివెంజ్ తీర్చుకునే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైల్ షూట్ కూడా ఇటీవల హైదరాబాద్ లో జరిగిందని చెబుతున్నారు.
           మన తెలుగు హీరో ఖండాంతరాలలో తన సత్తా చాటుతుంటే మనకి ఎంత ఆనందం..ఆల్ ది బెస్ట్ రానా.. ఇరగదీసై...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Heroine hansika visits tirumala
Bala krishna adhinayakudu movie coming soon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles