The great titanic movie now in 3d

the great titanic, movie now, in 3D

the great titanic movie now in 3D

7.gif

Posted: 03/22/2012 04:02 PM IST
The great titanic movie now in 3d

           titanic-inner ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేమికుల్ని మంత్రముగ్ధుల్ని చేసి, ప్రపంచ సినిమా చరిత్రపై చెరగని ముద్ర వేసిన 'టైటానిక్‌' చిత్రం 3డి వెర్షన్‌లో విడుదలయ్యేందుకు రంగం సిద్ధమైంది.  1997లో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించి అప్పటి బాక్సాఫీసు రికార్డుల్ని తిరగరాసింది. తాజాగా 'అవతార్‌' చిత్రంతో దర్శకుడిగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన జేమ్స్‌ కేమరూన్‌ 'టైటానిక్‌' చిత్రానికి సృష్టికర్త.
          లియొనార్డో డికాప్రియా-కేట్‌ విన్‌స్లెట్‌ జంటగా జాన్‌ లాండర్‌ నిర్మించిన ఈ చిత్రం సొంతం చేసుకున్న అవార్డుల గురించి ప్రత్యేకించి పేర్కొనాల్సిన పనిలేదు. ప్రపంచంలోని ప్రతిష్టాత్మక పురస్కారం 'టైటానిక్‌' సొంతమయ్యింది. 'టైటానిక్‌'తోపాటు 'అవతార్‌' చిత్రా న్ని కూడా నిర్మించిన జాన్‌ లాండర్‌ ఈ రెండు చిత్రాలు సాధించిన సంచలన విజయాలతో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో చేరిపోయారు.
       అసాధారణ ప్రేమకథాచిత్రంగా, దృశ్యకావ్యంగా ప్రశంసలందుకున్న 'టైటానిక్‌' చిత్రం ట్వంటీయత్‌ సెంచరీ ఫాక్స్‌ ద్వారా విడుదలవుతోంది. 'టైటానిక్‌' చిత్రం 3డి వెర్షన్‌ రూపకల్పన 2009లో మొదలైంది. కాగా, ఒకటిన్నర దశాబ్దం క్రితం, అప్పటికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞా నంతో రూపొంది అద్భుతాలెన్నింటినో అవలీలగా ఆవిష్కరించిన ఈ చిత్రం, ఇప్పడు మరింత పెరిగిపోయిన అత్యున్నత సాంకేతిక మాయాజాలాన్ని అందిపుచ్చుకుని 3డి వెర్షన్‌లోకి రూపాంతరం చెంది, ఏప్రిల్‌ మొదటివారంలో విడుదలవుతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Priyanka chopra launches nikon new model
Film actress nayana tara visits tirumala sri nilayam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles