10gif

10.gif

Posted: 03/19/2012 04:12 PM IST
10gif

            refsiతమిళ చలనచిత్ర నిర్మాతల మండలి, దక్షిణ భారత సినీకార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) మధ్య వేతనసవరణ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ నియమించిన కమిటీ ఇరువర్గాలతో మూడుసార్లు చర్చలు జరిపింది. తదుపరి చర్చలు త్వరలో జరుగనున్నాయి. ఇదిలాఉంటే, మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది.  కార్మికులు సకాలంలో షూటింగ్‌లకు రాక నిర్మాతలను ఇబ్బందులు పెడుతున్నారంటూ నిర్మాతల మండలి ఆరోపించింది.
             కార్తీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'అలెక్స్‌ పాండియన్‌' హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. దీనికి లైట్‌మెన్‌లు ఆలస్యంగా వస్తున్నారని ఆరోపిస్తూ నిర్మాత వారిని విధుల నుండి బహిష్కరించారు. అయితే,  కార్మికులపై కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పెఫ్సీ ఆధ్వర్యంలో కార్మికులు షూటింగ్‌ను బహిష్కరించి ఎదురుదాడికి దిగారు.karmikulu
           మరో తమిళచిత్రం 'కాటుమల్లి' షూటింగ్‌లో కూడా కార్మికులు ఇదేవిధంగా విధులకు ఆలస్యంగా వస్తున్నారంటూ ఆ చిత్ర ప్రొడ్యూసర్‌ నిర్మాతమండలికి ఫిర్యాదుచేశారు. దీంతో అత్యవసరంగా చెన్నరులో సమావేశమైన నిర్మాతల మండలి కార్మికుల చర్యలను నిరసిస్తూ ఈనెల 19న షూటింగ్‌ల బంద్‌కు పిలుపునిచ్చింది.
            కార్మిక సమాఖ్య నిర్మాతల మండలికి క్షమాపణ చెబితే తప్ప వారితో చర్చలు జరిపేది లేదని తీర్మానం చేశారు. తాము ఎటువంటి తప్పుచేయలేదని అనవసరంగా తమపై నిందలు వేస్తున్నారంటూ ఫెఫ్సీ పేర్కొంది. దీంతో కార్మికుల, నిర్మాతల మధ్య చర్చలు మళ్లీ మొదటికే వచ్చాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Action king arjun and mammootty new movie
Mohan babu birth day special story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles