All the best new telugu film casting srikanth and lakki sharma

all the best ,new telugu, film casting srikanth and lakki sharma

all the best new telugu film casting srikanth and lakki sharma

1.gif

Posted: 03/09/2012 11:57 AM IST
All the best new telugu film casting srikanth and lakki sharma

           All_10

           తెలుగు సినీ ప్రేక్షకులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారు హీరో శ్రీకాంత్, జేడీ చక్రవర్తి.  విభిన్నమైన కథాంశంతో, శ్రీకాంత్ కథానాయకుడిగా జేడీ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతోంది ‘ఆల్ ది బెస్ట్’ చిత్రం. లక్కీశర్మ ఇందులో కథానాయిక. సుధా సినిమా పతాకంపై జె.సాంబశివరావు  ఈ మూవీ నిర్మిస్తున్నారు.All_3

              ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం విలువలతో కూడుకున్న కథకు హాస్యాన్ని జోడించి  జేడీ తెరకెక్కిస్తున్నారు.   పేరుకు తగ్గట్టు గానే అందరికీ సంతోషాన్ని పంచేవిధంగా ఉంటుందంటున్నారు చిత్ర వర్గాలు. ఫిబ్రవరి 22 నుంచి ఈ నెల 2 వరకు రాజమండ్రిలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపారు. ఈ షెడ్యూల్లో రెండు పాటలు, కొంతటాకీతో పాటు క్లైమాక్స్‌ కు ముందు వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారు. రెండో షెడ్యూల్ ఈ నెల 3న విశాఖలో షూటింగ్ మొదలైంది. 11 వరకు జరిగే ఈ షెడ్యూల్‌లో కొంతటాకీతో పాటు హీరో, హీరో ఫ్రెండ్స్‌ పై పబ్ నేపథ్యంలో సాగే పాటను చిత్రీకరించనున్నారు.All_7          

           అలాగే ఈ నెల 24 నుంచి 29 వరకూ రామోజీ ఫిల్మ్ సిటీలో పతాక సన్నివేశాలను తీసారు. ఏప్రిల్ నెల తొలి వారంలో బ్యాంకాక్, పటాయ్‌ల్లో జరిగే రెండు పాటల చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది.చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, రఘుబాబు, కృష్ణభగవాన్, ప్రదీప్ రావత్, బ్రహ్మాజీ, రావురమేష్, రంగనాథ్, జీవా, సుత్తివేలు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: కృష్ణమోహన్ చల్లా, కెమెరా: జి.శివకుమార్, సంగీతం: హేమచంద్ర.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero sunil new movie starts today
Hollywood movie tekken dubbing in telugu titled jems dookudu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles