Gopichand marriage called off

11.gif

Posted: 02/15/2012 07:37 PM IST
Gopichand marriage called off

gopichandటాలీవుడ్ యాక్షన్ హీరోగా తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న హీరో గోపీచంద్. ఆయన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపార వేత్త కూతురు హరితతో మొన్నీమధ్యే ఆయన నిశ్చితార్ధం జరిగింది కూడా.

కాగా, ఆస్ట్రేలియాలో ఎం.బి.ఏ. పూర్తి చేసిన హరిత గోపీచంద్ జీవితంలోకి అడుగు పెట్టనుందని తెలిసి అంతా సంతోషించారు. నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఈ నెల 24 న హరితతో గోపీచంద్ వివాహం జరగాల్సి ఉంది. అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా భారీగానే జరిగినట్టుకూడా సమాచారం.

తాజాగా సమాచారం ప్రకారం వీరి వివాహం రద్దు అయినట్టు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్లనే ఈ వివాహం రద్దయినట్టు తెలుస్తోంది. అధికారిక సమాచారం వెలువడలేదు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Teja forthcoming film neeku naaku dash dash include 8 songs
Nagachaitanya gowravam stoped  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles