Utv head siddharth denies marriage with vidya

Zing, World, Bollywood, Vidya, Balan, Siddharth, Roy, Kapur, UTV, CEO, Dirty Picture, Naseeruddin, Shah, Silk Smita, Emran, Hashmi, Salman, Khan, Akshay, Kum

UTV Head Denies Marriage With Vidya,UTV Head Denies Marriage With Vidya, Mumbai, Aug 3: UTV head honcho Siddharth Roy Kapoor has denied media reports that he has secretly married Bollywood actor vidya Balan

UTV Head Siddharth Denies Marriage With Vidya.gif

Posted: 02/11/2012 04:09 PM IST
Utv head siddharth denies marriage with vidya

Vidyabalan

'ద డర్టీ పిక్చర్‌'తో తన సత్తా చాటుకున్న అందాల తార విద్యాబాలన్ త్వరలోనే శ్రీమతి కాబోతుంది. యూటీవీ సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌తో విద్యాబాలన్‌ పెళ్ళిముడి వేసుకోనున్నట్టు తెలుస్తోంది.ఎంతోమంది కుర్రాళ్ళ కలలరాణిగా నీరాజనాలు అందుకుంటున్న ఆమె త్వరలో వివాహబంధంలో అడుగుపెట్టబోతుంది. తన ప్రేమికుడు సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌ను పెళ్ళాడబోతున్న వార్త వెలువడింది. గతంలో ఇలాంటి వార్త విన్నప్పుడల్లా ఖండించిన విద్య ఈ సారి మాత్రం బదులివ్వక చిరునవ్వులు చిందిస్తోంది. 

విద్యాబాలన్‌, సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌ తమ పెళ్ళి గురించి పెదవి విప్పడం లేదు కానీ, ఇద్దరూ కలసి చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు. రాబోయే రెండేళ్ళ వరకు పలు వైవిధ్యమైన పాత్రలను అంగీకరించానని, ఇప్పట్లో పెళ్ళి ప్రసక్తే లేదని విద్య అంటోంది. కానీ, ముంబయ్‌ జనం మాత్రం విద్య, సిద్ధార్థ్‌ అతి త్వరలోనే మనువాడబోతున్నారని అంటున్నారు. మరి ఎవరిది నిజమో కానీ ఈ ప్రేమ్‌ కహానీ కారణంగా విద్యాబాలన్‌ 'కహానీ'కి మంచి క్రేజ్‌ ఏర్పడింది. 'ద డర్టీ పిక్చర్‌' రిలీజయిన తరువాత నుంచీ విద్య ముఖం మరింతగా కళకళలాడుతోంది.

దీనిని చూసి చాలామంది అమ్మడికి పెళ్ళికళ వచ్చేసిందని భావిస్తున్నారు. ప్రస్తుతం తన దృష్టి పెళ్ళి మీద కన్నా సినిమాలపైనే ఉందని విద్యాబాలన్ చెబుతోంది. 'డర్టీ పిక్చర్‌'లో దక్షిణాది శృంగారతార సిల్క్‌ స్మిత పాత్రను పోషించిన విద్యాబాలన్‌ ఇప్పుడు 'కహానీ' సినిమాలో గర్భవతిగా  నటిస్తోంది. ఈ యేడాది విడుదలయ్యే ఆమె తొలి చిత్రం 'కహానీ'యే. ఈ సినిమాతోనూ నటిగా మంచి మార్కులు పోగేసుకుంటానని విద్య ఆశిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aishwarya rai baby girl name is aaliyah
Shekhar kapur to play kamal haasan movie in uncle roll  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles