Prince mahesh babu new look

prince mahesh babu new look

prince mahesh babu new look

7.gif

Posted: 02/07/2012 02:07 PM IST
Prince mahesh babu new look

        mahesh  వరుస విజయాలతో యమ ‘దూకుడు’ మీదున్న ‘బిజినెస్ మేన్’ ప్రిన్స్ మహేష్ బాబు తన దైన శైలిలో దూసుకుపోతున్నారు. విజయపరంపర వచ్చే సినిమాల్లోనూ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు సుకుమార్ దర్శకత్వంలో రాబోతోన్న సినిమా కోసం ఈ హీరో చాలా కసరత్తే చేస్తున్నాడు. ఆ సినిమాలో షర్టు లేకుండా కనిపించే సీన్ ను బాగా పండించేందుకు మహేష్ శరీరాక్రుతిని మార్చబోతున్నాడు.
           అందుకోసం  హాలివుడ్ కండల వీరుడు బ్రాడ్ పిట్ కు పర్సనల్ ట్రెయినింగ్ ఇచ్చే జిమ్ కోచ్.. ‘గ్రెగ్ రోచే’ ను మహేష్ బాబు కోటి రూపాయలు ఇచ్చి ప్రత్యేకంగా హైదరాబాద్ రప్పించుకున్నాడు. రోచే, మహేష్ బాబు కు నాలుగు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తాడని తెలిసింది. శరీరాన్ని కండలు తిరిగేలా కనిపింప చేస్తూ అదేసమయంలో ముఖంలో మరింత వన్నెపెంచటం ఈ ట్రైనర్ ప్రత్యేకత. ఇక మహేష్ బాబు ను సరికొత్తగా చూడొచ్చన్న మాట.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dance master sundaram
S janaki background singer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles