Power star pawan kalyan at ishq audio launching function

power star, pawan kalyan, at ishq, audio launching ,function.. ,nitin and nitya, menon ,are the main roles in this movie

power star pawan kalyan at ishq audio launching function.. nitin and nitya menon are the main roles in this movie

5.gif

Posted: 02/03/2012 03:52 PM IST
Power star pawan kalyan at ishq audio launching function

         pawan_kalyan_in_ishk_audio_function నితిన్ అంటే నాకు ఇష్టం. అందుకే తనకోసమే ఈ వేడుకకు వచ్చాను.. ఈ సినిమా విజయం సాధించి నితిన్‌కి మరింత మంచిపేరు తెచ్చిపెట్టాలన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఇష్క’ సినిమా ఆడియో విడుదల వేడుకలో.    నాకెంతో ఇష్టమైన కెమెరామేన్ పి.సి.శ్రీరామ్.. ఆయన ఈ సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉందని తెలిపారు. నేను ఫంక్షన్లకు రావటం చాలా అరుదని, ఈ సందర్భంగా మిమ్మల్నందర్నీ కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని ఆడియన్స్ ని ఉద్దేశించి మాట్లాడారు. తొలి ఆడియో సీడీని పవన్‌కళ్యాణ్ ఆవిష్కరించి తొలి ప్రతిని కరుణాకరన్‌కి అందించారు.
         ISHQ_Audio

అనంతరం హీరో నితిన్ మాట్లాడుతూ  పవన్‌కళ్యాణ్‌గారంటే నాకెంత ఇష్టమంటే... నా బర్త్ డే వస్తే ఆ రోజంతా ఆయన ధరించిన టీ షర్ట్‌ నే వేసుకుంటుంటానన్నారు.  ఇంటర్ అవ్వగానే యూఎస్ వెళ్ళిపోదామనుకున్నానని, సరిగ్గా అప్పుడే ‘తొలిప్రేమ’ విడుదలవటం,  నాకు స్వతహాగా సినిమాలంటే ఇష్టమైనప్పటికీ ‘తొలిప్రేమ’తో అది పిచ్చిగా మారిందని నితిన్ వ్యాఖ్యానించారు.
          ఓ రోజు కరుణాకరన్ మా ఇంటికొచ్చారు. నవ్వు బావున్నావు.. నీతో సినిమా తీస్తా అన్నారు. అప్పట్నుంచి ఊహాలోకంలో విహరించేవాడినని నితిన్ అన్నాడు.. ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు దిల్‌రాజు, నందినీరెడ్డి, శిరీష్, లక్ష్మణ్, ఆర్.ఆర్.మూవీమేకర్స్ సురేష్‌రెడ్డి, గణేష్‌బాబు, సుధాకరరెడ్డి, అలంకార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
          నితిన్, నిత్యామీనన్ జంటగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో విక్రమ్‌కుమార్‌గౌడ్ నిర్మించిన చిత్రం ‘ఇష్క్’. ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్, అరవింద్, శంకర్ స్వరాలను అందించారు. ఫిబ్రవరి 24న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


.....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jeneliya retesh deshmukh marriage photo
Director srinu vaitla  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles