Director srinu vaitla

4.gif

Posted: 02/03/2012 01:44 PM IST
Director srinu vaitla

srinu_vaitlaఇంతకుముందు టాలీవుడ్ అగ్రహీరోలు తమ పారితోషకాలు భారీ గా పెంచాలని నిర్ణయించుకున్నారని వెల్లడించాం. తాజాగా దర్శకులు అదే బాటలో పయనిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు సినిమా స్టామినాని అంతర్జాతీయ స్థాయిలో పెంచేసిన దూకుడుసినిమా దర్శకుడు శ్రీను వైట్ల తన రెమ్యునరేషన్ భారీగా పెంచినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

శ్రీను వైట్ల తాజా ప్రాజక్ట్ అయిన ఎన్టీఆర్ సినిమాకి 10 కోట్ల రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడనే గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దీనికి ఎన్టీఆర్- శ్రీను వైట్ల కాంబినేషన్లో సినిమా చేయతలపెట్టిన నిర్మాత గణేష్ బాబు మాత్రం అవాక్కవలేదని సమాచారం. మరి దీనిపై మిగతా నిర్మాతల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

ఇక, శ్రీను వైట్ల దర్శకుడిగా, గణేష్ నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా వస్తోన్న సినిమా షూటింగ్  మార్చి 18 న ప్రారంభం కానుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Power star pawan kalyan at ishq audio launching function
Jeneliya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles