విలక్షణ నటుడు కమల్‌హాసన్ చూపించబోతోన్న మరో ఉగ్రరూపం.. ‘విశ్వరూపం’. ఈ దఫా ప్రయోగం మరింత ఆసక్తికరం, వైవిధ్యం గా చేసేందుకు కమల్ చాలా కసరత్తు చేస్తున్నాడు. పూర్తిస్థాయూ వాణిజ్య పంథాలో భారీ ప్రణాళికతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కమల్‌కి డ్రీమ్ ప్రాజెక్ట్.
దాదాపు రూ.100కోట్ల బడ్జెట్‌తో రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, పివిపి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పతాక సన్నివేశాలు మినహా సినిమా సాంతం పూర్తయింది. త్వరలో ఢిల్లీలో బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేయనున్నారు.
కమల్ శైలి విన్యాసాలతో అలరించనున్న ఈ సినిమాలో..కథక్ నృత్యం సినిమాకే హైలైట్‌గా నిలిచేలా చిత్రీకరించారట.తెరపై ఎన్నడూ చూడని రీతిలో ఈ గీతానికి ప్రత్యేక నృత్య భంగిమలను ప్రఖ్యాత కథక్ కళాకారుడు బిర్జు మహరాజ్ కంపోజ్ చేశారు.
బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ భీకర విలన్‌గా నటిస్తున్నారు. ఆండ్రియా జెరోమి, పూజా కుమార్, ఇషా శర్వాణి తమ అందచందాలతో కనువిందు చేయనున్నారు. శేఖర్ కపూర్ ఓ అతిధి పాత్రలో నటిస్తున్నారు. సినిమా పతాక సన్నివేశాలు భారీ యాక్షన్‌తో విజువల్ గ్రాండియర్ అనే పదానికి అర్థం చెప్పేలా ఉంటాయిట. తమిళ్, హిందీలో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగులోనూ అనువాదమై విడుదలకు సిద్ధమౌతోంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more