Krishnudu latest movie ramadandu

krishnudu, latest movie ,ramadandu, audio ,release ,yesterday,

krishnudu latest movie ramadandu audio release yesterday

5.gif

Posted: 01/29/2012 03:45 PM IST
Krishnudu latest movie ramadandu

raamadanఫుట్‌బాల్‌ క్రీడ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘రామదండు’. వేగేశ్న సతీష్‌ దర్శకత్వం వహించారు. నవ చిత్రాలయ క్రియేషన్స్‌ పతాకంపై రాధికా నారాయణరావు, బండి రత్నకుమార్‌ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. లలితా దేవి సమర్పణ.

 శ్రీవసంత్‌ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ‘మధుర’ ద్వారా మార్కెట్లోకి విడుదలైంది. తొలిసీడీని దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఆవిష్కరించి, పారిశ్రామిక వేత్త టి.వి.రావుకి అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్‌ కమ్ముల సినిమా గురించి మాట్లాడారు. ప్రస్తుత మన సమాజంలో క్రికెట్‌ గురించి తప్ప ఫుట్‌బాల్‌ పై మనం పెద్దగా ఆశక్తి చూపటంలేదన్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమా యువతకు ఫుట్ బాల్ పై ఉత్సుకత రేపుతుందన్నారు. 

raama

దర్శకుడు మాట్లాడుతూ ‘కొత్త కథలతో తెలుగు సినిమాలు రావనే అపవాదు ఉంది. దాని నుంచి బైటికొచ్చి చేసిన నవ్యపంథా సినిమా ఇది. శేఖర్‌ కమ్ముల ప్రేరణతో తీశాను’ అన్నారు.

bandi_ratna_kumar.jpegకృష్ణుడు మాట్లాడుతూ తాను ఈ మూవీలో స్కూల్‌ చిన్నారుల టీమ్‌కి కోచ్ గా వ్యవహరిస్తానని చెప్పారు. స్వస్థలం రాజోలుకి చెందిన స్కూల్‌లో ఈ సినిమా తెరకెక్కించారని వెల్లడించారు.  మన దేశంలో క్రీడల్లో వచ్చే కప్పులు సున్నా. ఈ తరుణంలో  క్రికెటే గాక ఇంకా ఎన్నో ఆట లున్నాయని చెప్పడానికే ఈ సినిమా  అన్నారు.

మధుర శ్రీధర్‌, నారాయణరావు, కెమెరా శరత్‌, విజయ్‌ కుమార్‌, అనీష్‌ కురువిల్లా, పృధ్వీ, అజయ్‌ఘోష్‌, రత్న కుమార్‌ ఆడియో రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mallika sherawath
Popular film actor kamal hassan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles