Victory venkatesh latest movie

victory venkatesh, latest movie ,in the direction ,of mehar ramesh,.bigins ,at ramanayudu ,studio ,today,

victory venkatesh latest movie in the direction of mehar ramesh.

4.gif

Posted: 01/25/2012 12:28 PM IST
Victory venkatesh latest movie

                      phoca_thumb_m_AW_venkatesh_shadow_04  విక్టరీ వెంకటేష్ – దర్శకుడు మెహర్ రమేష్ ల కాంబినేషన్ లో సరాకొత్త చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమా షూటింగ్ నేటి నుంచి రామానాయుడు స్టూడియోస్ లో జరుగుతోంది. ఈ చిత్రానికి టైటిల్ షాడోగా భావిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభ కార్యక్రమానికి మూవీ మొగల్ రామానాయుడుతో పాటు వి.వి.వినాయక్, వంశీ పైడిపల్లి తదితరులు హాజరయ్యారు. పూజా కార్యక్రమంపై తీసిన తొలిషాట్ కి వినాయక్ క్లాప్ కొట్టగా, రామానాయుడు కెమెరా స్విచ్చాన్ చేశారు.

ఎన్టీఆర్ తో భారీ ఎత్తున వైజయంతీ మూవీస్ బ్యానర్ పై శక్తిసినిమా రూపొందించిన దర్శకుడు మెహర్ రమేష్ ను ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే. దీంతో వెంకీతో తీయబోతోన్న ఈ సినిమాను మెహర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు సమాచారం. అన్ని శక్తి యుక్తులు ధారబోసి ఈ సినిమాను బ్లాక్ బస్టర్ గా రూపొందించాలని గట్టి పట్టుదలతో మెహర్ ఉన్నట్టు తెలుస్తోంది.

          ఈ సినిమాలో వెంకటేష్ సరసన రిచా గంగోపాధ్యయ్ నటిస్తుండగా, ఒక ప్రత్యేక పాత్ర లో తాప్సీ నటించే అవకాశం ఉంది. ఎన్నడూ లేనివిధంగా వెంకీ మాఫియా డాన్ గా ఈ మూవీలో కనిపించబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి కోన వెంకట్, గోపీ మోహన్ స్క్రిప్ట్ అందిస్తున్నారు. ప్రరుచూరి ప్రసాద్ నిర్మాత. 


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dhanush
Heroine nayanatara  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles