Heroine nayanatara

heroine nayanatara, re entry, in film industry ,in forth coming, nagarjuna ,movie

heroine nayanatara re entry in film industry

1.gif

Posted: 01/25/2012 11:58 AM IST
Heroine nayanatara

        1  ప్రభుదేవాతో పెళ్లి నేపథ్యంలో యాక్టింగ్ కు గుడ్ బై చెప్పిన నయన తార అనతి కాలంలోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. మళ్లీ తెరపై హీరోయిన్ గా కనిపించబోతున్నారు. ఆ మధ్య శ్రీరామరాజ్యంచిత్ర షూటింగ్ సమయంలో నయన తార అశ్రునయనాలతో పరిశ్రమకు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుదేవా కూడా మనసు మార్చుకుని సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో ఏమోకాని, మళ్లీ ఈ అందాల తార సినిమా స్క్రీన్ పై కనిపించటం సంతోషదాయంకం.

          ఇదిలా ఉంటే, కింగ్ నాగార్జున తదుపరి సినిమాలో నయనతార హీరోయిన్ గా యాక్ట్ చేయబోతున్నారు. దశరద్ డైరెక్ట్ చయబోతోన్న ఈ మూవీని కామాక్షి మూవీస్ బ్యానర్ మీద శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మధ్యలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతారు.

          ఇంతకుముందు నాగ్..దశరద్ కాంబినేషన్లో సంతోషంసినిమా వచ్చింది. సమారు పదేళ్ల గ్యాప్ తర్వాత వీరి భాగస్వామ్యంలో మళ్లీ చిత్రం రాబోతుంది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందిస్తారని సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Victory venkatesh latest movie
Young hero aadi latest movie lovely  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles