Power star pawan kalyan

power star pawan kalyan latest movie with sensational director poori jagannath

power star pawan kalyan latest movie with sensational director

2.gif

Posted: 01/22/2012 11:11 AM IST
Power star pawan kalyan

         images

          

           తెలుగు చిత్ర ప్రేమికులు పవన్ అభిమానులు ఎంతో ఎదురు చూస్తోన్న క్రేజీ కాంబినేషన్ మళ్లీ సాక్షాత్కారం కాబోతోంది. పూరీ జగన్నాథ్ కు తొలిసారి దర్శకుడిగా అవకాశం కల్పించి ప్రోత్సహించిన పవర్ స్టార్ పవన్ కళ్ల్యాణ్ మళ్లీ పూరీతో ఎప్పుడు సినిమా చేస్తారా అని యావత్ చిత్ర సీమ ఎదురుచూస్తోంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన బద్రిబ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా పవన్..పూరీ మరో సినిమా తెరకెక్కబోతోంది. దీంతో ఎంతగానో ఎదురుచూస్తోన్న పవర్ స్టార్ అభిమానులకు మాంచి కిక్ ఇచ్చే సినిమా రాబోతోందన్నమాట.


          ఇటీవల కాలంలో వీరిద్దరి సినిమా గురించి పలు వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. బిజినెస్ మాన్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పూరీ జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలు వీటికి ఊతమిచ్చాయి. వీటి నేపథ్యంలో త్వరలో వీరిద్దరి సినిమా రూపుదిద్దుకుంటుందని అనుకున్నప్పటికీ, ఇంత త్వరగా సినిమా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. పవన్ లేటెస్ట్ మూవీ గబ్బర్ సింగ్సినిమా పూర్తి అయిన వెంటనే పవన్..పూరీ ల సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కాగా, గతంలో పూరీ జగన్నాథ్ రవితేజ..ఇలియానాలతో ఇడియట్ 2 చిత్రాన్ని తీస్తున్నట్టు ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి ఆ ప్రాజక్ట్ ప్రక్కన పెట్టి పవన్ కళ్యాణ్ సినిమా మొదలు పెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడికానుంది.


          ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ అండ్ పూరీ జగన్నాథ్...

                                                                                                                   ...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu warriors win the match
Richa going to perform in item song  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles