Sr ntr 16th obituary today

Sr NTR 16th Obituary Today, Exclusive From NTR Ghat, NTR Family Members, NTR Family Pay Tribute, NTR Family At NTR Ghat, NTR Samadhi At NTR Ghat

Sr NTR 16th Obituary Today, Exclusive From NTR Ghat, NTR Family Members, NTR Family Pay Tribute, NTR Family At NTR Ghat, NTR Samadhi At NTR Ghat

Sr NTR 16th Obituary.GIF

Posted: 01/18/2012 01:34 PM IST
Sr ntr 16th obituary today

NTR

తెలుగు చిత్ర పరిశ్రమకు కానీ, తెలుగుతెరతో పరిచయమున్న ప్రతి ఒక్కరికీ  ఈయన పేరంటే తెలియని వారు ఉండరు. ఆయనే ఎన్.టి.రామారావు... ఈ సినిమాల పరంగా, రాజకీయ పరంగా సాధించిన విజయాలు, సృష్టించిన సంచలనాల గురించీ తెలుసు. అంతలా ఎన్.టి.ఆర్. తెలుగు తెరను ప్రభావితం చేశారు.1923 మే 28 న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్, కాలేజ్ రోజుల నుంచే అభినయం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. నటన పట్ల ఆయనకున్న మక్కువే చిత్ర సీమ వైపు అడుగులు వేయించింది. ఫలితంగా 'మనదేశం' సినిమా ద్వారా ఆయన చిత్ర రంగ ప్రవేశం జరిగింది. ఎన్టీఆర్ ఓ నవరస నట 'పాటశాల'గా మారడానికి ... అభినయ గ్రంధమై నిలవడానికి వెనుక అలుపెరుగని శ్రమ ఉంది... అపజయమెరుగని కృషి ఉంది.     

     1950  ప్రధమార్ధం లో వచ్చిన'పాతాళ  భైరవి', 'మల్లీశ్వరి', 'మిస్సమ్మ', 'కన్యా శుల్కం' ....ద్వితియార్ధంలో వచ్చిన 'మాయాబజార్', 'అప్పుచేసి పప్పుకూడు', 'భూకైలాస్', 'పాండురంగ మహాత్మ్యం', 'రాజమకుటం', 'బాలనాగమ్మ' వంటి చిత్రాలు ఎన్టీఆర్ లోని నటుడిని విభిన్న కోణాల్లో ఆవిష్కరించాయి. సాంఘిక-జానపద-పౌరాణిక చిత్రాల్లో ఆయన్ని తిరుగులేని నాయకుడిగా నిలబెట్టాయి! ఆ తర్వాత వచ్చిన 'బొబ్బిలి యుద్ధం', 'పల్నాటి యుద్ధం' వంటి చారిత్రకాలు ఎన్టీఆర్ లోని నటుడిని పరిపూర్ణం గా ఆవిష్కరించాయి.1960 లలో వచ్చిన 'శ్రీ వెంకటేశ్వర మాహాత్మ్యం', 'సీతారామ కల్యాణం', 'పాండవ వనవాసం',' లవకుశ' వంటి పౌరాణిక చిత్రాలు ఎన్టీఆర్ ని వెండితెర వేలుపు చేసేశాయి. ఇక 'రాముడు-భీముడు', 'గుండమ్మ కథ' వంటి సాంఘికాలతో  'మన ఎన్టీవోడు' అని ఆప్యాయంగా పిలుచుకునే స్థాయిలో ఆయన సామాన్య ప్రేక్షకులకి చేరువయ్యారు.     

     ఇక 70 లలో వచ్చిన 'దాన వీర శూర కర్ణ' ఎన్టీఆర్  కీర్తికిరీటంలో కలికితురాయిలా నిలిచింది. ఈ సినిమాలో శ్రీ కృష్ణుడు... కర్ణుడు... దుర్యోధనుడు గా మూడు పాత్రల్లో ఎన్టీఆర్ పండించిన పాత్రోచిత నటన ప్రేక్షకుల్ని రంజింపజేసింది. ఇక ఈ దశకం చివర్లో వచ్చిన 'అడవి రాముడు', ' డ్రైవర్ రాముడు', 'యుగంధర్,' 'వేట గాడు' వంటి చిత్రాలు మాస్ ఆడియన్స్ లో ఆయనకున్న ఇమేజ్ ను రెట్టింపు చేశాయి.  80 లలోనూ 'కొండవీటి సింహం', 'నా దేశం', 'జస్టీస్ చౌదరి', 'బొబ్బిలిపులి'వంటి సినిమాలు ఎన్టీఆర్ ఘన విజయాలకి దర్పణంగా నిలిచాయి. ఆ తర్వాత అటు రాజకీయాల్లో కొనసాగుతూనే అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చేశారాయన.

      1984 లో వచ్చిన 'శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ' చిత్రాన్ని ఆయన కెరీర్లో ఓ మైలురాయిగా పేర్కొనచ్చు. అంతవరకూ సినిమాలు చూడని వాళ్లు కూడా ఈ చిత్రాన్ని తిలకించారంటే ఆయన నటన ఎంతటి ప్రభావాన్ని చూపిందో అర్ధం చేసుకోవచ్చు. పల్లెల నుంచి ఎడ్ల బండ్లు కట్టుకుని వచ్చి మరీ జనం ఆ సినిమాను చూసేవారు! ఆ తర్వాత 1993 లో ఆటవిడుపు గా నటించిన 'మేజర్ చంద్రకాంత్ ' సినిమా అఖండ విజయాన్ని సాధించి, ఆయన చరిష్మ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది.  సావిత్రి, జమున, బి.సరోజాదేవి, జయలలిత, కృష్ణ కుమారి, శారద, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి మొదలైన కథానాయికలతో కలిసి నాలుగు దశాబ్దాలకి పైగా ఆయన అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించారు. విశేష మేవిటంటే కథానాయికల అందచందాల్ని ఆయన గ్లామర్ ఎప్పుడూ డామినేట్ చేస్తూనే వచ్చింది.

      నటుడిగా -నిర్మాత గా -దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన ఎన్టీఆర్, 'నటరత్న' గా, 'విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు'గా ప్రజల నుంచి ఎన్నో బిరుదులను అందుకున్నారు. వెండి తెరకు తెలుగు దనాన్నీ... వెలుగుదనాన్ని ప్రసాదించటమే కాకుండా, ఓ రాజకీయ నాయకుడిగా ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిన ఆ మహానుబావుడి 16 వర్ధంతి నేడు. తెలుగు జాతి వెలుగొందినంత కాలం ఆయన సదా స్మరణీయులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rama naidu for padma award
Mahesh babu businessman makes record collection on first day  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles