Happy birthday to a r rahman

Happy birthday to Rahman, music mastro ar rahman birthday today, today rahman birthday, oscar winner's birthday, rahman happy birthday, ar rahman love you

Happy Birthday to A R Rahman, Andhra wishesh wishing you a very happy birthday.

ar-rahman-birthday.gif

Posted: 01/06/2012 04:04 PM IST
Happy birthday to a r rahman

Happy Birthday to A R Rahman


          చిన్నవయసులోనే సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతున్న రారాజు ఎఆర్ రెహమాన్. అతని నడవడిక, క్రమశిక్షణ పెద్దవారికి సైతం ఆదర్శప్రాయం. మొదట ఎ ఎస్ దులీప్ కుమార్ గా పిలువబడిన రహమాన్,  23వ ఏట నుంచి తన  పేరును అల్లా రఖా రహమాన్ గా పేరుమార్చుకున్నాడు.  1966 లో ఇదే రోజు చెన్నైలో జన్మించిన ఈ నిత్య సంగీత సాథకుడు నేటితో 47వ వసంతంలోకి అడుగిడుతున్నారు.

          11వ ఏటనుంచి నేటి వరకూ ప్రతిక్షణం సంగీత సాగరాన్ని ఈదుతూనేఉన్నారు రహమాన్. ఆయన కెరీర్లో ఎన్నో మలుపులు. తమిళనాడులో మాస్టర్ ధనరాజ్ వద్ద సంగీత సాథన మొదలు ఇళయరాజ, రాజ్..కోటి, వంటివారి వద్ద రహమాన్ పనిచేసి గురువును మించిన శిష్యుడనిపించుకున్నారు. అతని సంగీత ప్రయాణంలో ఎన్నో అద్భుత ఘట్టాలు, అవార్డులు, రివార్డులు.

          శ్రోతల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో పాటలకు రహమాన్ స్వరాలు సమకూర్చారు. మణిరత్నం `బొంబాయి`, `జంటిల్మన్`, రాంగోపాల్ వర్మ `రంగీలా`, `దిల్ సే`, `తాళ్`, `రంగ్ దే బసంతి`, తదితర ఎన్నో చిత్రాలకు సంగీతాన్ని అందించి సినీరంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు.

          `స్లమ్ డాగ్ మిలియనీర్` సినిమాతో ఆస్కార్ అవార్డు అందుకున్న రహమాన్ ఎన్నో కీర్తి శిఖరాలను అధిరోహించారు. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, ఫిల్మ్ ఫేర్, కలైమణి అవార్డులతో పాటు వివిధ రాష్ట్రప్రభుత్వాల వద్ద, ఇండియన్ గవర్నమెంట్ వద్ద పలు అవార్డులు దక్కించుకున్నారు.

          భారతీయ సంగీత సామ్రాజ్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తోన్న ఎ ఆర్ రెహమాన్ మరిన్ని కీర్తి కిరీటాలు ధరించాలని ఆకాంక్షిస్తోంది...ఆంధ్రావిశేష్.కాం..హ్యాపీబర్త్ డే టు రెహమాన్...

                                                                              

                                                                                    - నారాయణ ఆనాల

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mister perfect remake movie with allu sirish
Sri rama rajyam 50 days successmeet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles