Balakrishna will beat simha records

balakrishna will beat simha records

balakrishna will beat simha records

simha.gif

Posted: 01/04/2012 04:12 PM IST
Balakrishna will beat simha records

నందమూరి వంశం లో నిన్నటి తరం హీరోలలో నేటికి అంత మార్కెట్ ఉన్న హీరో బాల కృష్ణ అనే చెప్పాలి. నందమూరి వంశం లో మూడవ తరం హీరోలైన జూనియర్ యాన్. టీ. ఆర్, కళ్యాణ్ రాం తమదైన శైలి లో సినిమాలు చేస్తుండగా, ఒక విధంగా వీరికి పోటీగా సినిమాలు చేస్తున్నారు బాలయ్య. వరుస విజయాలతో దూసుకుపోతుండగా, అనుకోకుండా అపజయాల బాట పడవలసి వచ్చింది బాలయ్యకి ఒకానొకప్పుడు. సిని విమర్శకులు కూడా ఇక బాలయ్య రిటైర్ అయితే మంచిదని సలహా కూడా ఇచ్చారు. కాని, బాలయ్య కి దర్శకుడు బోయపాటి శీను అందించిన 'సింహ' విజయం, బాలయ్య కి ఒకవిధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరిన్ని సినిమాలు చేసేలా ప్రేరణ ఇచ్చింది. ఈ మధ్యనే వచ్చిన 'శ్రీ రామ రాజ్యం' విజయం కూడా ఇందుకు నిదర్సనం. ఇప్పుడు బాలయ్య మరిన్ని సినిమాలు అంగీకరించారు. వరుసగా సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నారు. అతి త్వరలో 'అధినాయకుడు' కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే, గతం లో బాలయ్య చేసిన కొన్ని సినిమాలలో తనని హీరో గా ప్రాజెక్ట్ చెయ్యాలని తీసిన కొన్ని సన్నివేశాల కారణంగా సినిమాలకే నష్టం వచ్చిందని, అటువంటి సన్నివేశాలు అధినాయకుడు లో కూడా ఉన్నాయని కొందరి వాదన. అయితే అసలు విషయం ఎంతో చెప్పడానికి ఈ సినిమా దర్శక - నిర్మాతలు కూడా ససేమీరా అంటున్నారు. కాని అధినాయకుడు మాత్రం బాలయ్య ప్రతిష్టని పెంచే విధంగానే ఉంటుందని, గతంలో బాలయ్య చేజేక్కిన్చుకున్న సంక్రాంతి విజయాలలాగే, అధినాయకుడు కూడా విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు... అసలు విజయం ఏంటోతెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prince mahesh babu latest movie
Manchu manoj trurns as a writer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles