Check out bollywood stars new year celebrations

Shah Rukh. Salman Khan,Salman Khan,Maheep Kapoor,Bhavna Pandey.

SRK and Sallu take their rivalry and revelry to the Emirates. Mirror gives you a lowdown. Latest Bollywood news on Hrithik Roshan, Karan Johar, Shahrukh Khan. As only few hours left for the year to end, stars got busy to reach their destination to welcome the coming year in their own distinctive style.

Bollywood Stars New Year Celebrations.gif

Posted: 12/31/2011 03:52 PM IST
Check out bollywood stars new year celebrations

Shaharuk_gowriబాలీవుడ్ పరిశ్రమ దుబాయ్ కి తరలివెళుతుందని కంగారు పకండి. బాలీవుడ్ అయితే దుబాయ్ కి వెళ్ళింది కానీ పరిశ్రమాత్రం ఇక్కడే ఉంది. ఉన్న ఒక్క జీవితాన్ని షూటింగులపాలు చేస్తే.. ఇక ఎంజాయ్‌మెంట్ మాటేంటి?’’ అంటున్నారు బాలీవుడ్ తారలు. ఏడాదిలో ఎక్కువ శాతం ఆర్క్‌లైట్లు, కెమెరా ఫ్లాషుల మధ్య గడిపే సదరు తారలు కొత్త సంవత్సరం నాడు మాత్రం కుటుంబ సభ్యులతోనో, స్నేహితులతోనే గడపాలనుకుంటున్నారు. ఈ పని నిమిత్తం కాస్తంత ‘ఔటింగ్’ కూడా ఉంటే బాగుండు అనుకుని, ఎప్పుడూ వుండే ముంబయిని వీడి, ఎక్కువమంది విదేశాలకు వెళుతున్నారు. వారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి ముఖ్యంగా ‘దుబాయ్’ని వేదికగా ఎంపిక చేసుకోవడం విశేషం. ఆ రకంగా కొత్త సంవత్సరం నాడు ఎవరెవరు? ఎక్కడెక్కడ? ఉంటారో ఓ లుక్కేద్దామా మరి...?

కింగ్‌ఖాన్ షారుక్‌ఖాన్ ఇప్పటికే తన భార్య గౌరీఖాన్, పిల్లలు ఆర్యన్, సుహానాతో కలిసి దుబాయ్ చెక్కేశారు. అక్కడ తమ సొంత ఇంట్లో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకబోతున్నారు షారుక్. అంతేకాదు తమతో పాటు కొత్త సంవత్సరం వేడుకలో పాల్గొనవలసిందిగా హృతిక్‌రోషన్, అర్జున్‌రామ్‌పాల్‌ని కూడా ఆహ్వానించారాయన. షారుక్‌ని విపరీతంగా అభిమానించే హృతిక్ ఈ ఆహ్వానాన్ని కాదంటారా.... తన భార్యాబిడ్డలు సుసానే, హృదాన్, హెరాన్‌లతో దుబాయ్‌లో అడుగుపెట్టేశారట. Salman_katrina
వీళ్లని అనుసరిస్తూ.. అర్జున్ రామ్‌పాల్ తన భార్య మెహర్ జెస్సియా, కుమార్తెలు మహికా, మైరాలతో ఆ సుందర నగరానికి వెళ్లారట. అజయ్‌దేవగన్, కాజల్ కూడా తమ పిల్లలు నైసా, యగ్‌తో కలిపి దుబాయ్ వెళ్లారు. అయితే షారుక్ ఏర్పాటు చేసిన పార్టీకి కాకుండా వీరు ప్రత్యేకంగా ప్లాన్ చేసుకున్నారట.

ఇటీవలే 46వ పుట్టినరోజుని ముంబయ్‌లో జరుపుకున్న సల్మాన్‌ఖాన్ ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం దుబాయ్ వెళ్లారు. తన సోదరులు సొహైల్‌ఖాన్, అర్భాజ్‌ఖాన్, వారి భార్యలు మలైకా, సీమా, చెల్లెళ్లు అల్విరా, అర్పితలతో కలిసి పార్టీ చేసుకో బోతున్నారట. అలాగే తన మాజీ ప్రేయసి కత్రినాకైఫ్‌ని కూడా దుబాయ్‌కి ఆహ్వానించారట సల్మాన్. క్రిస్మస్ పండగ సందర్భంగా ఇటీవల కత్రినాకైఫ్ యూకే వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులతో పండగ చేసుకున్న ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ ఆహ్వానం మేరకు దుబాయ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారట.
ఈ ఏడాది (2011) సంజయ్‌దత్, ఆయన భార్య మాన్యతలకు మర్చిపోలేనిది. మాన్యత కవలపిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తమ బిడ్డలు షరాన్, ఇక్రాతో కలిసి ఈ దంపతులు ఇటీవల బాలీ వెళ్లారు. అయితే బిగ్ బాస్ షూటింగ్ కోసం శుక్రవారం బాలీ నుంచి ముంబయ్ వచ్చారు సంజయ్. ఈ షూటింగ్ ముగించుకుని, తిరిగి కొత్త సంవత్సరం రోజున బాలీలో వుండటానికి ప్లాన్ చేసుకున్నారాయన.

Saif_kareenaఇక సైఫ్‌అలీఖాన్, కరీనాకపూర్ వచ్చే ఏడాది వివాహం చేసుకోబోతున్నారు కాబట్టి... ‘బ్యాచిలర్స్’గా జరుపుకోబోతున్న చివరి కొత్త సంవత్సం ఇదే. కావున ఈ ఇద్దరూ చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేసుకున్నారని సమాచారం. ఈ ప్రేమికులు కొత్త సంవత్సరాన్ని స్విట్జర్లాండ్‌లో ఆహ్వానించబోతున్నారు. ఇక, ఇండియాలో పలువురు తారలు గోవాలో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. మల్లికా శెరావత్, నేహా ధూపియా, సయాలీ భగత్, కొయినా మిత్రా, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ వంటి తారలు మాత్రం నృత్యప్రదర్శనలిచ్చి న్యూ ఇయర్‌ని ‘క్యాష్’ తీసుకోవడం ద్వారా ‘జోష్’ అవ్వాలనుకుంటున్నారు. మల్లికా 2 కోట్లు, నేహా 40 లక్షలు, జాక్వెలైన్ 35 లక్షలు, సయాలీ భగత్ 10 లక్షలు, కొయినా 15 లక్షలు తీసుకుంటున్నారట కొత్త సంవత్సరం అకౌంట్‌లో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamanna birthday party dhanush sings kolaveri and dances
Ntr movie in kannad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles