Amanis brother in harassment

Amani's brother in harassment ,harassment case in Nellore, Telugu Actress Pictures, Amani Wallpapers, Amani Posters, Amani Stills at Devasthanam Movie Pressmeet, Actress Amani Latest Photo Gallery

Amani's brother in harassment

Devasthanam Movie.GIF

Posted: 12/03/2011 05:58 PM IST
Amanis brother in harassment

Amanis brother in harassment

న‌టి ఆమ‌ని ఎన్నో కుటుంబ‌క‌థా చిత్రాల‌లో హీరోయిన్‌గా న‌టించి మంచి పేరు సంపాదిచిని కొన్నేళ్ళుగా సినిమాల‌కి దూరంగా ఉంది. కార‌ణం ఏమిట‌ని అడిగితే.. తన బ్రదర్ మనీ మైండెడ్ మనిషి అని సినీ నటి ఆమని వాపోతోంది. అందుకే తన ఫ్యామిలీ గొడవల్లో తనను ఇరికించి వేడుక చూస్తూ మిన్నకుండి పోయాడని వాపోయింది.

ఒక సోదరిగా తన బ్రదర్‌కు పెళ్లి చేస్తే.. ఆయన మాత్రం తనను కష్టాల్లో ఇరికించారంది. ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం హీరోగా నిర్మితమవుతున్న “దేవస్థానం” చిత్రంలో ఆయనకు భార్యగా ఆమని నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను సినిమారంగం నుంచి త్వరగా వెళ్ళిపోయాయనే బాధ తనకు ఇపుడు కలిగిందన్నారు. మంచి పాత్రలు వస్తున్న సమయంలోనే కొన్ని ఫ్యామిలీ కారణాలవల్ల దూరమయ్యానని చెప్పుకొచ్చింది.

నా బ్రదర్‌ మనీమైండెండ్‌.. వారి ఫ్యామిలీలో గొడవల్లో నన్ను ఇరికించాడు. సోదరిగా అతనికి పెండ్లిచేశాను. ఆ తర్వాత అతని భార్య చెప్పినట్లు నాపై ఆస్తిగొడవల్లో లాగాడు. పెండ్లి చేయడం వరకే నాపని.. ఆ తర్వాత విషయాలు అనవసరం అని అంది.  కానీ… సెలబ్రిటీ కావడంతో.. బాగా సంపాదిస్తున్నాననే అక్కసుతో నా నుంచి డబ్బులులాగాడు. వాడికి ఇద్దరు ఆడపిల్లలు. వారంటే నాకు చాలా ఇష్టం. వారి మొహం చూసి వారి భవిష్యత్‌ గురించి కోట్ల రూపాయలు వారికి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ఇటువంటి ఫ్యామిలీ గొడవల్లో సినిమాలు చేయలేక దూరంగా ఉన్నట్టు చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hrithik sexiest asian man in 2011
Pawan kalyan praises balayya moive  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles