Ram gopal varma ramayanam movie story

Ram Gopal Varma Ramayanam Movie Story,director Ram Gopal Varma, Ramayana, Ramayanam Movie Story

Ram Gopal Varma Ramayanam Movie Story

Ram Gopal Varma.GIF

Posted: 11/20/2011 02:46 PM IST
Ram gopal varma ramayanam movie story

ramgopal20

అయోధ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనర్ దశరధరావు. ఆయన భార్య కౌసల్య. పనిమీద ముంబయ్‌కి వెళ్లిన దశరధరావుకి కైకేయి అగర్వాల్ అనే అమ్మాయి పరిచయమవుతుంది. అనుకోని పరిస్థితుల్లో ఆమెను రెండో వివాహం చేసుకుంటాడు. ఒక బలహీన పరిస్థితుల్లో కైకేయికి పుట్టిన భరత్‌కుమార్‌కే కంపెనీ అప్పజెబుతానని కమిట్ అవుతాడు దశరధరావు.

తండ్రి మాటను జవదాటని దశరాధరావు పెద్ద కొడుకు రామ్‌శంకర్.. ఆయోధ్య గ్రూప్ వర్కర్స్ ఎంత బాధ పడుతున్నా తండ్రి వెళ్లమన్న విధంగా తమ కంపెనీకి సంబంధించిన ఒక సిక్‌యూనిట్‌ని నడపడానికి వెళ్లిపోతాడు. అన్నంటే ప్రాణమున్న లక్ష్మణ్ శంకర్ కూడా అన్నను ఫాలో అవుతాడు... ఇదంతా వింటుంటే పాత రామాయణం కథ గుర్తొస్తోంది కదూ?... ఇది రామ్‌గోపాల్‌వర్మ సృష్టించబోతున్న ‘రామాయణం’. ఎప్పుడూ ఏదో ఒక సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచే రాము... ఈ సరికొత్త రామాయణానికి శ్రీకారం చుట్టబోతున్నారు.

 ‘‘రామాయణం కథ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వింటూనే ఉన్నాను ఏ కారణం చేత ఎవరు ఈ కథను అంతగా గౌరవించారు. అనే విషయాన్ని చాలాసార్లు విశ్లేషించాను కూడా. ఈ కారణంగానే రామాయణాన్ని నా స్టైయిల్‌లో తీయాలన్న కోరిక కలిగింది. కానీ నా రామాయణం కథ జరిగేది త్రేతాయుగంలో కాదు. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో. హైదరాబాద్‌లో రామాయణంలోని పాత్రలు వుంటే... ఆ రామాయణం ఎలా ఉంటుంది? అనే ఆలోచనలోంచి వచ్చిందే ఈ కథ’’ అని చెప్పారు వర్మ.

బాపు తీసిన ‘శ్రీరామరాజ్యం’ ఇప్పుడు ప్రదర్శితమవుతోన్న సందర్భంలో రాము-ఈ సరికొత్త రామాయణానికి ఆలోచన చేయడం గమనార్హం. ఏమైనా ఈ వర్మ రామాయణం ఎన్ని వివాదాలకు దారితీస్తుందో వేచిచూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Panja audio launch function
Kolkata film fest ends with rang rasiya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles