Panja audio launch function

Panja audio launch function, Pawan kalyan Panja Audio release, Panja Movie Wallpapers, Pawan Kalyan, Director Vishnuvardhans Panja WallPapers

Panja audio launch function

Panja audio launch function.GIF

Posted: 11/20/2011 03:00 PM IST
Panja audio launch function

Panja audio launch function

వారసత్వంగా వచ్చే విద్య కంటే... స్వశక్తినే నేను నమ్ముతాను. అందుకోసం ఎంత కష్టానికైనా నేను సిద్ధం. అన్నయ్య ‘నటిస్తావా’ అని అడిగినప్పుడు ‘చిరంజీవి తమ్ముడ్ని అయినంత మాత్రాన ప్రజలు నన్నెందుకు చూడాలి అని నాకు నేను ప్రశ్నించుకున్నాను. ‘తొలిప్రేమ’ దాకా ఈ కన్‌ఫ్యూజన్ నాలో ఉంది. ఈ మధ్య కొన్ని సినిమాల ద్వారా అభిమానుల్ని నిరాశపరిచిన మాట నిజం. నేనెప్పుడూ కెరీర్‌ని నిర్లక్ష్యంగా చూడను. పరిస్థితులు కలిసి రాలేదు అంతే.. విష్ణువర్థన్ ఈ సినిమాను వండర్ అనిపించే రీతిలో తీశాడు.

 ఆయన సారథ్యంలో కష్టం తెలియకుండా పనిచేశాం. రాజమౌళితో సినిమా ఎప్పుడు అని అభిమానులందరూ అడుగుతున్నారు. తెలుగువారు గర్వించదగ్గ మగధీరలాంటి సినిమా తీసినందుకు అప్పుడే తనని అభినందించాను. నేనెవర్నీ సినిమా చేయమని నోరు తెరిచి అడగలేను. అన్నీ కలిసి రావాలి. ‘పంజా’ తప్పకుండా మీ అంచనాలకు తగ్గట్టు ఉంటుంది’’ అని పవన్‌కళ్యాణ్ అన్నారు.

పవన్ కథానాయకుడిగా విష్ణువర్థన్ దర్శకత్వంలో నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ, నగేష్ ముంత, వెంకట్ దేవినేని కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘పంజా’. యువన్‌శంకర్‌రాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రం పాటల విడుదల శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్ పై విధంగా స్పందించారు. ఎస్.ఎస్.రాజమౌళి ఆడియో సీడీని ఆవిష్కరించి పవన్‌కళ్యాణ్‌కి అందించారు.

‘పంజా’ 2జీబీ మెమరీ కార్డ్‌ని పవన్‌కళ్యాణ్ విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో కథానాయికలు సారాజేన్ డయాస్, అంజలీ లావానియా, కె.రాఘవేంద్రరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి రానా, బ్రహ్మానందం, కీరవాణి, దామోదరప్రసాద్, అలీ, పైడిపల్లి వంశీ, గణేశ్‌బాబు, బీవీఎస్‌ఎన్‌ప్రసాద్, ఎం.ఎల్.కుమార్‌చౌదరి, భగవాన్, డీవీవీ దానయ్య, డా.కె.వెంకటేశ్వరావు, సాయిధరమ్‌తేజ్ తదితరులు కూడా పాల్గొన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajamouli new film with naga chaitanya
Ram gopal varma ramayanam movie story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles