చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ లెనొవా.. ఇటీవలే మొబైల్ రంగంలో అడుగుపెట్టి ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని తమ ఖాతాదారులుగా మార్చుకుంటుంది. ఈ క్రమంలో మోటరోలా కంపెనీని కూడా తనలో మిలితం చేసుకున్న అమ్మకాల్లో తన సత్తాను చాటుకుంటూ దూసుకెళ్తుంది. తాజాగా లెనోవా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ మోడల్ ను లాంచ్ చేసింది. కె 8 ప్లస్ పేరుతో భారతీయ విఫణిలో అవిష్కరించిన ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేకంగా లభించనుంది.
లెనోవా వివరాలతో పాటు ఇవాళ భారతీయ విఫణిలో అవిష్కరిస్తున్నట్లు ప్రకటించిన లెనోవా ఇండియా ఈ మేరకు వివరాలను సామాజిక మాద్యమం ట్విట్టర్ ద్వారా వివరాలను తెలిపింది. నూతన అవిష్కరణగా వస్తున్న లెనోవా కే8 ప్లస్ ధరను రూ.10,999గా కంపెనీ ప్రకటించింది. ఈ విక్రయాలు రేపటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయని లెనోవా ప్రకటించింది. కొన్ని వారాలలో ఇది ఇతర దుకాణాల్లో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ఈ సందర్భంగా లాంచింగ్ ఆఫర‍్లను కూడా కంపెనీ ప్రకటించింది. రూ.10వేల దాకా ఎక్సేంజ్ ఆఫర్, జియో ఖాతాదారులకు 30జీబీ అదనపుడేటా, మోటోప్లస్ 2 హెడ్ ఫోన్స్ రూ. 599లకే అందిస్తోంది. ఇంకా ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ బై ద్వారా 5 వా. బ్లూటూత్ స్పీకర్‌పై రూ.100 తగ్గింపు, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులపై 15శాతం తగ్గింపును ప్రకటించి. సెప్టెంబర్ 7-8 తేదీల మధ‍్య ఈ ఆఫర్లు వర్తిస్తాయి.
లెనోవో కె8 ప్లస్ స్పెషిఫికేషన్లు:-
5.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
మీడియా టెక్ డాక్ హెలియో పీ25 ఆక్టా కోర్ 2.6 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.1.1
3జీబీ ర్యామ్,
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
13ఎంపీ+ 5ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
(And get your daily news straight to your inbox)
Jan 30 | అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తన కొత్త ఎక్స్7 సిరీస్ 5జీ మొబైల్ ఫోన్లను ఫిబ్రవరి 4న భారత్ లో అవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు ఎలా వుంటాయన్న... Read more
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more