Lamborghini Alpha-One smartphone launched కాలం చెల్లిన టెక్నాలజీతో కాస్ట్లీ స్మార్ ఫోన్ లాంచ్.. ధరెంతంటే..?

Alpha one android smartphone launched for rs 1 56 lakh with outdated tech

Lamborghini Alpha-One, Android smartphone, launched, price, outdated tech, Lamborghini, luxury phone, smartphones, specification, features, mobiles, smartphones, , E-commerce, business, technology

Lamborghini's new Android smartphone worth $2,450 or Rs 1.56 lakh has been launched and is available in the UK and the UAE markets.

కాలం చెల్లిన టెక్నాలజీతో కాస్ట్లీ స్మార్ ఫోన్ లాంచ్.. ధరెంతంటే..?

Posted: 08/24/2017 07:32 PM IST
Alpha one android smartphone launched for rs 1 56 lakh with outdated tech

ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల ఉత్పత్తుల సంస్థ లంబోర్గిని.. స్మార్ట్ ఫోన్‌ రంగంలో అడుగుపెట్టి.. తాజాగా తీసుకువచ్చిన కాస్టీ ఫోన్ కాలం చెల్లిన టెక్నాలజీతో కూడకున్నదన్న విమర్శలు తెరపైకి వస్తున్నాయి. లగ్జరీ కార్ల మాదిరిగానే తన బ్రాండ్ ఇమేజ్ కు తగ్గట్లుగా లగ్జరీ ఫోన్లను ఉత్పత్తి చేస్తున్నామని చెప్పుకున్న లంబోర్గిని.. తాజాగా తీసుకువచ్చిన ఆల్ఫా వన్ స్మార్ట్ ఫోన్.. అశించిన స్థాయిలో లేకపోగా.. ఇప్పటికే భారతీయ విపణీలో అంతకంటే అధునాతన రేంజ్ లో స్మార్ట్ ఫోన్లు ఉన్నతవర్గాల కస్టమర్లను అకర్షిస్తున్నాయి.

ఇప్పటికే లంబోర్గిని కంపెనీ నుంచి కొన్ని మోడళ్లు అంతర్జాతీయ మార్కెట్లోకి రాగా.. అవి కొంతమేరకు ప్రపంచ సంపన్న స్మార్ట్ ఫోన్ ప్రియులను అకర్షించాయి. కాగా, ఈ సంస్థ తాజాగా తీసుకొచ్చిన ‘ఆల్ఫా వన్‌’ లగ్జరీ స్మార్ట్ ఫోన్ మాత్రం అవుట్ డేటెట్ టెక్నాలజీతో భారతీయ విపణిలోకి వచ్చింది. ధరలో మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఏకంగా 2450 డాలర్లుగా నిర్ధారించింది లంబోర్గిని సంస్థ యాజమాన్యం. భారత కరెన్సీలో ఈ ధర దాదాపు 1.57లక్షలు. ప్రస్తుతం ఈ ఫోన్‌ యూకే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మార్కెట్లోకి వచ్చింది.

ఫోన్ వెనుక భాగాన్ని ఉక్కుతో కాకుండా.. ఇటాలియన్ బ్లాక్‌ లెదర్‌తో తయారు చేశారు. దీంతో పాటు కంపెనీ లోగోను కూడా ముద్రించారు. ఫోన్‌తో పాటు ఇటాలియన్‌ లెదర్ ఫోన్ కేస్ కూడా వస్తుంది. ఆండ్రాయిడ్ నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే ఈ ఫోన్లో అన్ని అధునాతన ఫీచర్లు ఉన్నాయని సంస్థ వర్గాలు పేర్కోంటున్నా.. ఇప్పటికే 6 జీబి ర్యామ్ తో మార్కెట్లు అందుబాటులో వున్నాయి. అయితే ఈ లగ్జరీ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఎలా వుంటాయో వేచి చూడాల్ిసందే మరి.

ఆల్ఫా వన్‌ ఫీచర్లు :-

* 5.5 అంగుళాల డిస్‌ప్లే
* ఆండ్రాయిడ్‌ 7.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
* 1440x2560 రిసెట్యూషన్
* 4జీబీ ర్యామ్‌
* 64జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
* డ్యుయల్‌ సిమ్‌ సదుపాయం
*డ్యుయల్ ఫ్ఱంట్ స్పీకర్లు
* 20మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
* 8మెగాపిక్సెల్‌ ముందు కెమెరా
* ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ సదుపాయం
* 3250ఎంఏహెచ్‌ అన్ డిటాచెబుల్ బ్యాటరీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lamborghini  Alpha-One  Android smartphone  luxury phone  outdated tech  business  technology  

Other Articles