వారంతంలో నష్టాలను మూటగట్టుకున్న దేశీయ మార్కెట్లు Sensex, Nifty fall over 1 percent; financials drag

Sensex slumps 329 pts nifty ends below 8100

sensex, nifty, indian share market, indian stock exchange, Tata Consultancy Services, infosys, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

Reliance has been making efforts in the direction for long and laying down fiber optic cable across many part of the countries. With the FTTH services, Reliance aims to deliver 1 Gbps broadband internet in India.

వారంతంలో నష్టాలను మూటగట్టుకున్న దేశీయ మార్కెట్లు

Posted: 12/02/2016 04:56 PM IST
Sensex slumps 329 pts nifty ends below 8100

దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. విదేశీ మార్కెట్ల నుంచి ఆశించిన స్థాయిలో పవనాలు అందకపోవడం..  అంతర్జాతీయంగా వస్తున్న బలహీన సంకేతాలకు ప్రాఫిట్ బుకింగ్ తోడవ్వడంతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గత నెల 8 నుంచి లాభనష్టాల మధ్య ఊగిసలాడుతన్న మార్కెట్లు లాభాల కన్న నష్టాలనే అధికంగా మూటగట్టుకున్నాయి. దీంతో మదుపురులు కూడా మార్కెట్లలో పెట్టబడులు పెట్టేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు.

పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ఆటో కంపెనీల నవంబర్ నెల విక్రయ డేటా ఒక్కసారిగా కుప్పకూలడం, పోటీ తీవ్రతరమవడంతో వైరలెస్ ప్రొవేడర్ల షేర్లు అతలాకుతలమవడం మార్కెట్లను దెబ్బతీసింది. అమెరికా నెల వారీ ఉద్యోగ డేటా విడుదల, ఇటలీ తన రాజ్యాంగంపై రెఫరాండం, వచ్చే వారంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ద్రవ్య పాలసీ నేపథ్యంలో మార్కెట్  సెంటిమెంట్ స్తబ్దుగా కొనసాగుతున్నాయి. దీంతో ఉదయం ప్రారంభం నుంచే మార్కట్లు నష్టాల బాట పట్టాయి,

ఉదయం మార్కెట్లు ప్రారంభంలోనే సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా నష్టాపోయింది, అటు నిఫ్టీ కూడా 22 పాయింట్లకు పైగా దిగజారింది, ఆ తరువాత కూడా మార్కెట్లు ఏ కోశానా కోలుకోలేదు. అమ్మకాల ఒత్తిడితో మధ్యాహ్న సెషన్లో మరింత పడిపోయి వారం ముగింపులో భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. సెన్సెక్స్ ఒక్కసారిగా 329.26 పాయింట్లు కుప్పకూలి . నిఫ్టీ సైతం 106.10 పాయింట్లు పడిపోయి 8086.80గా క్లోజ్ అయింది. ఫలితంగా మార్కెట్ ముగిసే సమయానికి 329 పాయింట్ల నష్టంతో లాభంతో26,230.66 వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 106 పాయింట్లను కోల్పోయింది దీంతో నిఫ్టీ కూడా 8087 పాయింట్లకు దిగజారింది.

దీనికి తోడు భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షించనుండంతో అటు బ్యాంకు రంగ సూచీలు కూడా నష్టాలను ఎదుర్కోన్నాయి, ఫలితంగా అన్ని రంగాల సూచీలు నష్టాలను ఎదుర్కోన్నాయి, మరీ ముఖ్యంగా అటో, బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, మిడ్ క్యాప్ నిఫ్టీలు భారీగా నష్టాలను ఎదుర్కోగా, ఎఫ్ఎంజీసీ, ఐటీ, మెటెల్స్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, టెక్నాలజీ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్యలు కూడా నష్టాలల్లో ముగిసాయి, ఈ క్రమంలో ఏషియర్ మోటార్స్, ఐడియా సెల్యూలార్, టాటా పవర్, సిప్లా, అల్ట్రా టెక్ సిమెంట్ తదితర సంస్థల షేర్లు లాభాలను అర్జించగా, ఏఫియన్ పెయింట్స్, మారుతి సుజుకీ, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, బిపిసీఎల్ సంస్థల షేర్లు నష్టాలను ఎదుర్కోన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles

Today on Telugu Wishesh