who is the successor of rbi governor raghuram rajan..?

Who will replace raghuram rajan at rbi

Raghuram Rajan, Raghuram rajan retires,Raghuram Rajan quit, vijay kelkar, ashok chawla, ashok lahiri, subir gokarn, rakesh mohan, urjit patel, Arundhati Bhattacharya, RBI Governer, successor, Indian Economy, Arun jaitley, Union finance ministry, PM Modi, Narendra modi, subramanya swamy, BJP MP

The RBI governor Raghuram Rajan stunned government officials and investors on Saturday by announcing he would step down when his term ends on September 4.

రాజన్ నుంచి ఆర్బీఐ గవర్నర్ పగ్గాలు అందకునే వారెవరూ..?

Posted: 06/19/2016 01:16 PM IST
Who will replace raghuram rajan at rbi

త్వరలో ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి రఘురాం రాజన్ తప్పుకోనున్న నేపథ్యంలో ఆయన తర్వాత ఆ బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారని విషయం ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. తనకు మరోసారి ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు చేపట్టే ఉద్దేశం లేదని, బోధనా రంగంలోకి వెళ్లాలనుకుంటున్నట్లు రాజన్ కూడా స్పష్టం చేసిన ఈ నేపథ్యంలో ఆ చర్చ మరింత వేడెక్కింది. అయితే, ఆ బాధ్యతలు అప్పగించే విషయంలో ప్రభుత్వం వద్ద పెద్ద జాబితానే ఉందంట.

ముఖ్యంగా ఏడుగురు వ్యక్తులతో తదుపరి ఆర్బీఐ గవర్నర్ కోసం జాబితా సిద్ధం చేసినట్లు అధికార వర్గాల సమాచారం. అందులో ముఖ్యంగా విజయ్ కేల్కర్, రాకేశ్ మోహన్, అశోక్ లాహిరి, ఉర్జిత్ పటేల్, అరుంధతి భట్టాచార్య, సుబిర్ గోఖర్న్, అశోక్ చావ్లా పేర్లు ఈ పదవి కోసం సిద్ధం చేసినట్లు వినికిడి. అయితే, తొలిసారి ఆర్బీఐ గవర్నర్ పదవిని ఒక మహిళకు అందించాలని, ఆ నేపథ్యంలోనే అరుధతి భట్టాచార్యకు ఆ బాధ్యతలు అప్పగిస్తారని చర్చలు ఊపందుకున్నాయి. ఈ ఊహాగానాలకు తెరపడేందుకు మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghuram Rajan  Arundhati Bhattacharya  RBI Governer  successor  Indian Economy  

Other Articles