Sensex rebounds 260 points, hits 3-week high, Nifty above 7800

Bulls in high spirits sensex up 260 pts nifty ends near 7900

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

BSE Sensex recovered 209.87 points, or 0.82 per cent, to 25,800.52, with all sectoral indices led by metal, healthcare and realty trading in the green, advancing by up to 1.40 per cent.

3 వారాల గరిష్టస్థాయికి సెన్సెక్స్.. లోహ, హెల్త్ కేర్, రియాల్టీలకు లాభాలు

Posted: 12/23/2015 06:19 PM IST
Bulls in high spirits sensex up 260 pts nifty ends near 7900

ఒక రోజు లాభాలు, మరో రోజు నష్టాలతో ఒడిదోడుకులకు గురవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో పయనించాయి. ఇవాళ నమోదు చేసుకున్న లాభాలతో మూడు వారాల గరిష్టస్థాయి 25 వేల 850.కి చేరుకున్నాయి. లోహం, హెల్త్ కేర్, రియాల్టీ సెక్టార్లు పుంజుకుని లాభాలలో పరుగులు తీయడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా లాభాలను అందుకున్నాయి. దీనికి తోడు వీదేశీ మదుపరులు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టబడులకు సుముఖత వ్యక్తం చేయడంతో మార్కెట్లు ఇవాళ లాభాలలో పయనించాయి.

ఇవాళ ఉదయం మార్కెట్లు ప్రారంభమైన సమయం నుంచి లాభాలు వచ్చాయి. అయితే కొద్ది మేరకు వచ్చిన లాభాలను మార్కెట్లు అదిమి పట్టుకోవడంతో చివరకు సెన్సెక్స్ 260 పాయింట్ల మేర లాభాలను ఆర్జించగా, నిఫ్టీ కూడా 7800 మార్కుకు చేరువలో ట్రేడింగ్ ను ముగించింది. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెస్సెక్స్ 260 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 80 పాయింట్ల లాభంతో 7866 పాయంట్ల వద్ద ముగిసింది.

ఇవాళ జరిగిన ట్రేడింగ్ లో ఒక్క కన్యూమర్ డ్యూరబుల్స్ సెక్టార్ మినహా అన్ని సూచీలు లాభాలలో దూసుకెళ్లాయి. హెల్త్ కేర్, బ్యాంకింగ్, బ్యాకింగ్ నిఫ్టీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్స్, అయిల్ అండ్ గ్యాస్ సూచీలు భారీ లాభాలను ఆర్జించగా, ఐటీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, టెక్నాలజీ, చిన్న మధ్య తరహా పరిశ్రమల సూచీలు, ఎఫ్ ఎం జీ సీ, అటో రంగ సూచీలు కూడా స్వల్ప లాభాలను అర్జించాయి. ఈ క్రమంలో గెయిల్, హిండాల్కో, వేదంతా, బిహెచ్ఇఎల్, సన్ ఫార్మా పరిశ్రమల సూచీలు భారీ లాభాలను అర్జించగా, ఏసీసీ, మహింద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, ఎయిషన్ పెయింట్స్, బిపిసీఎల్ సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Gold and silver  indian rupee  RBI  

Other Articles