BSE Sensex down for sixth day, plunges 274 pts on GST logjam

Gst bill impasse daunts markets sensex down 274 points

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

Equities tumbled for a sixth straight session today as the BSE Sensex plummeted by 274 points while the NSE Nifty cracked below the 7,700-level as investors grew worried about a possible delay in the key tax reform bill.

దెబ్బతీసిన ఇంధన రంగం.. నష్టాల్లో దేశీయ మార్కెట్లు..

Posted: 12/09/2015 06:09 PM IST
Gst bill impasse daunts markets sensex down 274 points

భారత స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరవ రోజు కూడా నష్టాలలో పయనించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో స్తబ్దతతో పాటు జీఎస్టీ బిల్లు అమోదంలో జాప్యం కూడా మార్కెట్లను దెబ్బతీసింది. వీటితో పాటు ముడి చమురు, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న భయాలు మరో సెషన్ లోనూ ఇన్వెస్టర్ల సంపదను హరించి వేశాయి. మంగళ, బుదవారాలను కలుపుకుని ఈ రెండు రోజుల వ్యవధిలో భారత మార్కెట్ ను నమ్ముకుని పెట్టుబడులు పెట్టిన వారి సంపద రూ. 2.50 లక్షల కోట్లకు పైగా తగ్గినట్లయింది. బుధవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 274.28 పాయింట్లు పడిపోయి 1.08 శాతం నష్టంతో 25,036.05 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 89.20 పాయింట్లు పడిపోయి 1.16 శాతం నష్టంతో 7,612.50 పాయింట్ల వద్దకు చేరాయి.

బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.76 శాతం, స్మాల్ క్యాప్ 2.24 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 5 కంపెనీలు మాత్రమే లాభాల్లో నడిచాయి. బీహెచ్ఈఎల్, టీసీఎస్, ఐటీసీ, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ తదితర కంపెనీలు లాభపడగా, వీఈడీఎల్, బీపీసీఎల్, సిప్లా, కోల్ ఇండియా, టాటా స్టీల్ తదితర కంపెనీలు నష్టపోయాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ మంగళవారం నాడు రూ. 96,71,518 ఉండగా, అది 95,27,980 కోట్లకు పడిపోయింది. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి కంపెనీల మార్కెట్ కాప్ రూ. 97,79,857 కోట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం 2,917 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 542 కంపెనీలు లాభాలను, 2215 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Gold and silver  indian rupee  RBI  

Other Articles