Mercedes-Benz AMG GT S debuts in India, priced at Rs 2.40 crore

Mercedes benz launches the amg gt s in india

Mercedes, Mercedes Benz, Luxury car, Mercedes AMG GT S, Luxury cars, Germany company Mercedes-Benz

The quickest AMG in India yet, the AMG GT S was introduced in India by racing icon, Bernd Schneider at the starting price of Rs 2.40 crore (ex-Delhi).

భారతీయ విపణిలోకి మెర్సిడెస్-బెంజ్ కొత్త లగ్జరీ కారు

Posted: 11/25/2015 12:58 PM IST
Mercedes benz launches the amg gt s in india

లగ్జరీ కార్లు ఒకటి తరువాత మరోకటి భారతీయ విఫణిలోకి వస్తున్నాయి. గత వారం లాండ్ రోవర్ నుంచి రేంజ్ రోవర్ ఇవోక్యూను అందుబాటులోకి రాగానే.. తాజాగా జర్మనీ కంపెనీ మెర్సిడెస్-బెంజ్ కొత్త లగ్జరీ కారును భారతీయ మార్కెట్లోకి తీసుకువచ్చింది. దేశంలోని సుసంసన్నులను టార్గెట్ గా చేసుకుని ఈ కార్లు వస్తున్నాయి. ఏఎంజీ జీటీ ఎస్ పేరుతో అందిస్తున్న ఈ కారు ధర రూ.2.4 కోట్లు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని కంపెనీ తెలిపింది. 15 కొత్త కార్లను భారత మార్కెట్లోకి అందిస్తామని ఈ ఏడాది మొదట్లోనే చెప్పామని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ రోలాండ్ ఫోల్గార్ అన్నారు. దీంట్లో భాగంగానే ఈ కొత్త కారును తెచ్చామని, ఈ ఏడాది తామందిస్తున్న 14వ కొత్త కారు ఇదని వివరించారు.

4-లీటర్ బై-టర్బో ఇంజిన్‌తో అందిస్తున్న ఈ కారులో ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు, ఆడాప్టివ్ బ్రేక్ లైట్స్, కాంపొజిట్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ చైల్డ్ సీట్ రికగ్నిషన్ వంటి ప్రత్యేకతలున్నాయని చెప్పారు. భారత్‌లో అమ్ముడవుతున్న ఏఎంజీ కార్లలో అత్యంత వేగవంతమైన కారు ఇదే. గరిష్ట వేగం గంటకు 310 కి.మీ. 0-100 కి.మీ. వేగాన్ని 3.8 సెకన్లలోనే అందుకోగలుగుతుంది. ఇతర వాహనాలను ఢీకొట్టకుండా చూసే కొలిజన్ ప్రివెన్షన్ అసిస్ట్ ప్లస్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Luxury cars  Germany company Mercedes-Benz  AMG GT S  

Other Articles