Reliance Jio To Launch LYF 4G Smartphones Before Diwali

Reliance jio s 4g enabled handsets to hit the market by diwali

Reliance Industries, Reliance Jio, Reliance 4G, LYF, LYF Realinace Jio, Broadband Internet, Reliance Jio, 4G internet, Domestic companies, mukesh ambani, reliance jio, reliance 4g smartphone, reliance smartphone, reliance lyf smartphone

Reliance Industries is set to unleash its 4G handsets bonanza in Diwali. The company plans to start selling its 4G handsets under the LYF brand from Diwali.

దీపావళి నాటికి భారతీయ విఫణిలోకి రిలయన్స్ జియో 4జీ ఫోన్లు

Posted: 10/21/2015 12:54 PM IST
Reliance jio s 4g enabled handsets to hit the market by diwali

బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్‌నెట్‌తో దూసుకురావటానికి సన్నాహాలు చేస్తున్న రిలయన్స్ జియో... 4జీ ఇంటర్‌నెట్ సేవలకన్నా ముందు తన బ్రాండ్‌తో మొబైల్ హ్యాండ్‌సెట్లను మార్కెట్లోకి విడుదల చేయటానికి సిద్ధమవుతోంది. లైఫ్(ఎల్‌వైఎఫ్) బ్రాండ్‌తో ఈ నెల 28 నుంచి దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లను విక్రయించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దేశవ్యాప్తంగా 1,50,000కుపైగా వివిధ రిటైల్ ఔట్‌లెట్లలో ఇవి లభిస్తాయి. రిలయన్స్ జియో లైఫ్ బ్రాండ్‌తో తొలుత రూ.10 వేల శ్రేణిలో 5 మోడళ్లను ప్రవేశపెడుతోంది.

5 అంగుళాల స్క్రీన్, 2 జీబీ ర్యామ్ వీటి ప్రత్యేకతలు. నవంబర్‌లో రూ.4 వేలు ఆపై శ్రేణిలో మరిన్ని మోడళ్లను విడుదల చేయనున్నట్లు తెలిసింది. మొత్తమ్మీద రూ.4 వేలు- 25 వేల మధ్య ఈ ఫోన్లు లభిస్తాయి. వాస్తవానికి భారత స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో రూ.4-12 వేల శ్రేణిలో లభించే మోడళ్ల వాటా ఏకంగా 78 శాతం వరకూ ఉంది. అందుకే జియో సైతం ఈ శ్రేణి లో అధిక మోడళ్లను తేనున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 100 రోజుల్లో 10 కోట్ల యూనిట్లు విక్రయించాలని జియో లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. లక్ష్యాన్ని చేరుకోగానే వాణిజ్య పరంగా 4జీ సర్వీసులు ప్రారంభం అవుతాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Broadband Internet  Reliance Jio  4G internet  Domestic companies  

Other Articles