Elephone Vowney flagship smartphone dual-boots Android 5.0 and Windows 10 Mobile

Smartphone with android 5 0 lollipop windows 10 mobile dual boot launched

android, elephone, elephone mobiles, elephone vowney, elephone vowney price, elephone vowney specifications, mobiles, windows 10 mobile. smart phone with smartphone dual-boots, smart phone with Android 5.0 and Windows 10 Mobile os, Windows 10 Mobile phone, Android 5.0 Lollipop mobile os

Chinese smartphone manufacturer Elephone Vowey to launch a handset which would dual-boot Windows 10 Mobile and Android 5.0 Lollipop mobile operating systems.

డ్యుయల్ ఓఎస్ లతో భారతీయ విఫణిలోకి ‘ఏలిఫోన్’ స్మార్ట్ ఫోన్

Posted: 09/19/2015 05:22 PM IST
Smartphone with android 5 0 lollipop windows 10 mobile dual boot launched

సాంకేతిక విప్లవాలకు కేరాప్ అడ్రస్ గా నిలిచి యావత్ ప్రపంచ దృష్టిని అకర్షిస్తున్న చైనా కంపెనీల నుంచి మరో అరుదైన స్మార్ ఫోన్ వచ్చేసింది. చైనీస్ కంపెని, ఏలీఫోన్ నుంచి రెండు అపరేటింగ్ సిస్టమ్ లను కలిగి వున్న ఫోన్ రానే వచ్చింది. ఏలిఫోన్ వోవీ పేరుతో భారతీయ విఫణిలోకి ఈ స్మార్ ఫోన్ ను ప్రవేశపెట్టగా, ఈ నెల 30 నుంచి ఈ స్మార్ ఫోన్ విక్రయాలను సంస్థ చేపడుతుంది. దీని ప్రారంభ చరను మాత్రం 299.99 డాలర్లు( భారత కరెన్సీ ప్రకారం సుమారుగా రూ 19,851) గా నిర్ణయించింది. ఆండ్రాయిడ్ లలిపాప్ 5.0 వర్షన్ తో పాటు విండోస్ 10 మొబైల్ os లు, రెండూ ఈ ఫోన్ లో పనిచేస్తాయి. ఈ ఫోన్ సోంతం చేసుకోవాలనుకునే వారు ఏలిఫోన్ వెబ్ సైట్ లో ప్రీ ఆర్డర్స్ కూడా చేసుకునే సౌకర్యం సంస్థ యాజమాన్యం కల్పించింది.

ఈ ఫోన్ ప్రత్యేకతలు
* 5.5 in క్వాడ్ HD డిస్ప్లే,
* 535PPi, 3gb ర్యామ్
* క్వాడ్ కోర్ ఇంటెల్ ప్రొసెసర్
* 20.7MP రేర్ కెమేరా
* సోనీ IMX230 డ్యూయల్ led ఫ్లాష్ సెన్సార్
* 4K వీడియో రికార్డింగ్, 8MP ఫ్రంట్ కెమేరా
* ఫింగర్ ప్రింట్ సెన్సార్
* 4200 mah బ్యాటరీ
* 64gb ఇంబిల్ట్ స్టోరేజ్, 64gb sd కార్డ్ సపోర్ట్
* గోల్డ్, వైట్ అండ్ గ్రే రంగులలో వోవీ ఫోన్ లభ్యం

కేవలం ఆండ్రాయిడ్ os పైనే రన్ అయ్యేలా మరో వేరియంట్ స్మార్ ఫోన్ ను కూడా సంస్థ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. అయితే దీనిలో ఆక్టో కోర్ మీడియా టెక్ 2.2GHz ప్రొసెసర్ మరియు 3800 mah బ్యాటరీ మార్పులు ఉన్నాయి. మిగిలిన అన్నీ ప్రత్యేకతలు యధావిధిగా కోనసాగనున్నాయి. మరోవైపు ఈ అక్టోబర్ 20 న మరొక స్మార్ట్ ఫోన్, elephone p9000ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టనుంది సంస్థ. 4gb ర్యామ్ అండ్ మీడియా టెక్ ఫ్లాగ్ షిప్ చిప్ సెట్ Helio X20 ప్రొసెసర్ ను 33,034 రూ లకు రిలీజ్ చేయనుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ ప్రత్యేకతలను పరిశీలిస్తే డ్యూయల్ అపరేటింగ్ సిస్టమ్ గల వోవీ స్మార్ ఫోన్ వేరియంట్ బాగున్నట్టు అనిపిస్తుంది. ఇక ఆలస్యమెందుకు వెంటనే మీ పీస్ ను అర్డరు చేసుకోండి..

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : smart phone  elephone  elephone vowney  android  windows 10  

Other Articles