SpiceJet launches EMI payment scheme to book tickets

Spicejet now offers air tickets on emi

SpiceJet, SpiceJet EMI offer, SpiceJet fares, SpiceJet offer, Airlines, Aviation, SpiceJet offers, SpiceJet EMI scheme, SpiceJet ticket fares, SpiceJet passengers, budget carrier Spicejet, Spicejet ticket cost, deferred payment plan, interest rate on EMIs, Axis bank credit card, HSBC credit card, Kotak bank credit card, Standard Chartered credit card

SpiceJet is now offering EMI or equated monthly installment payment option to customers. The EMIs can be paid over a period for 3, 6, 9 or 12 months.

ఇక వాయిదాల పద్దతిలో స్పైస్ జెట్ విమాన టిక్కెట్లు..

Posted: 07/25/2015 04:37 PM IST
Spicejet now offers air tickets on emi

వాయిదాల పద్దతి మధ్యతరగతి వారికి మిక్కిలి ఇష్టమైన పద్దతి. తమ బడ్జెట్ కు మించి వున్న వస్తువులను, గృహోపకారాలను, ఎలక్ట్రానిక్ వస్తువులను వాయిదాల పద్దతిలో కొనుగోలు చేసుకోవడం వారికి పరిపాటి. ఈ పద్దతి ద్వారా తమకు కావాల్సిన వస్తువులు తమ ఇంట్లో వుంచుతుంటారు రమారమి అందరు మధ్యతరగతి వాసులు. అయితే ఇన్నాళ్లు కేవలం గృహోపకార వస్తువులకు, ప్లాట్ లకు , అపార్టుమెంటు ఫ్లాట్, కార్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు పరిమితమైన వాయిదాల పద్దతి ఇకమీదట విమానయానానికి కూడా వర్తింపచేస్తూ స్పైస్ జెట్ ఎయిర్ వేస్ నిర్ణయం తీసుకుంది.

జీవితంలో ఒక్కసారైనా విమానయాన్ని చేయాలన్న కోరిక బలంగా వున్న మద్యతరగతి కుటంబాలను ఆకర్షించేందుకు ఈ తరహా నిర్ణయం తీసుకుంది ఈ పద్దతి ద్వారా విమానయానం చేయాలనుకునే వారి కల నెరవేర్చడంతో పాటు తమ సంస్థ కూడా లాభాల భాటలో పయనించేందుకు వీలుగా స్పైస్ జెట్. విమానయాన సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. చౌక విమానయాన సంస్థ స్పైస్ జెట్ తాజాగా ఈ ఆఫర్ ప్రకటించింది. బుక్ నౌ, పే లేటర్ అనే పథకంతో మధ్యతరగతి ప్రజలకు మరింత చేరువకానుంది. ఈ పద్దతి కింద టెకెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులు ఆ చార్జీలను మూడు, ఆరు, తొమ్మిది, లేదా పన్నెండు సులభ నెలసరి వాయిదాల పద్దతిలో తిరిగి చెల్లించుకునే అవకాశాన్ని స్పైస్ జెట్ కల్పిస్తుంది.

ఇందుకోసం పలు బ్యాంకులతో కూడా ఒప్పందాలను కుదర్చుకుందీ విమానయాన సంస్థ. యాక్సిస్ బ్యాంక్, హెచ్ఎస్బిసీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు క్రెడిట్ కార్టులున్న వాళ్లు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని విమాన సంస్థ అధికారులు తెలిపారు. సాధారణంగా కొనేవాళ్ల కంటే ఇలా వాయిదాల్లో కోనేవాళ్లు 12 నుంచి 14 శాతం వడ్డీ అదనంగా చెల్లించాల్సి వుంటుంది. కానీ క్రెడిట్ కార్డుల మీద వసూలు చేసే 36 శాతం వడ్డీతో పొలిస్తే ఇది తక్కువేనని స్పైస్ జెట్ అంటోంది. ఈ పద్దతి ద్వారా టికెట్ బుక్ చేసుకున్నవారి అనుకోని పరిస్థితులలో టిక్కెట్ ను రద్దు చేసుకోవాల్సి పరిస్థితి ఏర్పడిన పక్షంలో వడ్డీ ఖర్చులను వినియోగదారులే భరించాల్సి వుంటుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SpiceJet  SpiceJet EMI offer  SpiceJet fares  SpiceJet offer  Airlines  Aviation  

Other Articles