Bajaj Plans Capacity Expansion as Pulsar Demand Regains Strength

Bajaj hits past forward

Bajaj Auto,Bajaj Manufacturing Plant Chakan,Bajaj Pulsar, Vehicle manufacturing company, Bajaj, Pulsar Adventure Sport Series

As Bajaj fights to regain marketshare, it is seeing traction for its products, and will therefore have to expand capacity at its Chakan plant

బజాజ్ నుంచి రెండు సరికోత్త పల్సర్ అడ్వంచరస్ స్పోర్ట్స్ వేరియంట్స్..

Posted: 06/13/2015 03:55 PM IST
Bajaj hits past forward

ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్.. గత పదిహేను మాసాలుగో కోల్పోతున్న తన వాహనాల విక్రయాలను మళ్లీ పుంజుకునేందుకు సరికోత్తగా రెండు వేరియంట్లను భారతీయ విఫణిలోకి విడుదల చేసింది. హీరోహోండా కంపెనీ మళ్లీ పుంజుకుని నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడంలో.. బజాజ్ కంపెనీ కొనుగోళ్లు కాస్త మందగించాయి. దీంతో హోండా టీవీఎస్ సంస్థల వాహనాలు కూడా మాసాలలో అధిగమించడం, బజాజ్ వాహనాల కోనుగోళ్లు పడిపోవడంతో సరికోత్తగా ఆలోచించిన బజాజ్ సంస్థ తన గత వైభవాన్ని మళ్లీ సమకూర్చుకునేందుకు రెండు కోత్త వేరియంట్లతో మార్కెట్లోకి వచ్చింది. అటు వీటిని విఫణిలోకి విడుదల చేయడంతో పాటు క్రూసర్ బైక్ లపై కూడా బజాజ్ దృష్టిపెట్టింది.

పల్సర్ అడ్వెంచర్ స్పోర్ట్ సిరీస్‌లో రెండు కొత్త వేరియంట్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది బజాజ్. ప్రధానంగా యువతను టార్గెట్ చేస్తూ, సరికొత్త డిజైన్‌తో ‘పల్సర్ ఏఎస్ 200’, ‘పల్సర్ ఏఎస్ 150’ అనే వేరియంట్లను రూపొందించింది. ‘ఏఎస్ 200’ వేరియంట్‌లో 4 వాల్వ్ 200సీసీ డీటీఎస్-ఐ ఇంజిన్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్, ట్రిపుల్ స్పార్క్ టెక్నాలజీ, సుపీరియర్ బ్రేకింగ్, నైట్రక్స్ మోనో సస్‌పెన్షన్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ.92,500 (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). అలాగే ‘ఏఎస్ 150’ వేరియంట్‌లో 4 వాల్వ్ 149.5సీసీ డీటీఎస్-ఐ ఇంజిన్, ట్విన్ స్పార్క్ టెక్నాలజీ, 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్, ఎయిర్ కూలింగ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ.79,000 నిర్ణయించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vehicle manufacturing company  Bajaj  Pulsar Adventure Sport Series  

Other Articles