Sensex, Nifty end flat ahead of F&O expiry; BHEL up 4%

Sensex ends the day in green nifty in red

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp

BHEL closed up 4 percent, followed by ONGC, Coal India, Bharti Airtel and Axis Bank. Tata Motors fell 5 percent while M&M, Sun Pharma, GAIL and Infosys were other losers.

నష్టాలను పూడ్చుకుని తటస్థంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు

Posted: 05/27/2015 05:17 PM IST
Sensex ends the day in green nifty in red

దేశీయ స్టాక్ మార్కెట్లలో బుధవారం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఐరోపా దేశాల నుంచి వచ్చిన సానుకూల పవనాల నేపథ్యంలో ఎట్టకేలకు నష్టాలను పూడ్చుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు తటస్థంగా ముగిసాయి. రేపటితో ఎఫ్ అండ్ ఓ కాలపరిమితి ముగుస్తుండటంతో.. ఉదయం మార్కెట్లు ప్రారంభమైనప్పటి నుంచే మార్కెట్లు నష్టాల బాటలో పయనించాయి. సెన్సెక్స్ 166 పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ 8300 మార్కుకు దిగువన ట్రేడింగ్ కొసాగించింది. ఈ తరుణంలో ఐరోపా దేశాల నుంచి వచ్చిన సానుకుల పవణాలతో మార్కెట్లు నష్టాల బారిన పడకుండా చేసింది.

దీంతో సెన్సెక్స్ స్వల్ప లాభాలను మూటగట్టుకోగా, నిఫ్టీ మాత్రం అత్యల్ప నష్టాన్ని చవిచూసింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 33 పాయింట్లు లాభపడి  27,564  వద్ద ముగియగా, నిఫ్టీ 4.75 పాయింట్లు నష్టపోయి 8,334 వద్ద ముగిసింది. దీంతో గత రెండు రోజుల వరుస నష్టాలకు కళ్లాలు పడినట్లైంది. సూచీలలో అటో, ఐటీ, టెక్నాలజీ, హెల్త్ కేర్, చిన్నతరహా పరిశ్రమల సూచీలు నష్టాలను చవిచూడగా, మిగిలిన అన్ని సూచీలు లాభాలలోనే కొనసాగాయి. ఈ క్రమంలో బిహెచ్ఇఎల్ ఓఎన్జీసీ, యాక్సిక్ బ్యాంక్, ఐడియా సెల్యూలార్, ఎన్ ఎం డీ సి సంస్థలు లాభాలలో పయనించగా, టెక్ మహింద్రా, టాటా మెటార్స్, మహింద్రా అండ్ మహింద్రా, సన్ ఫార్మ, ఇన్పోసిస్ తదితర సంస్థలు నస్టాలను చవిచూశాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  indian rupee  

Other Articles