Blood on Dalaal Street: Sensex dives 723 pts, Nifty ends below 8100

English title blood on dalaal street

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, CRR, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, RBI policy rates in April, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys

The Sensex ended 722.77 points or 2.6 percent down at 26717.37, and the Nifty plunged 227.80 points or 2.7 percent at 8097.00. About 599 shares have advanced, 2143 shares declined, and 158 shares were unchanged.

బ్లాక్ వెడ్నెస్ డే.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్..

Posted: 05/06/2015 06:25 PM IST
English title blood on dalaal street

దేశీయ స్టాక్ మార్కెట్లు మరో బ్లాక్ వెడ్నెస్ డేను ఇవాళ చవిచూశాయి. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు నాలుగు నెలల కనిస్ట స్థాయికి చేరకున్నాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలకు తోడు ఇవాళ ఉదయం అసియా మార్కెట్ల నష్టాలు జతకలవడంతో ఉదయం ప్రారంభం నుంచే స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి.దీనికి తోడు కార్పొరేట్లకు మేలు కలిగించే భూ సేకరణ వంటి కీలక బిల్లుల అమోదంలో పార్లమెంట్ వెనుకంజ వేయడంతో ఇన్వెస్టర్ల ెంటిమెంట్ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. దీంతో దేశీయ సూచీలు తీవ్రంగా నష్టపోయాయి.

ఏ ఒక్క సూచీ లాభాలలో కోనసాగలేదు. అన్నింటికంటే బ్యాంకింగ్, అటో, క్యాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్, మధ్య తరహా పరిశ్రామిక రంగం సహా చమురు రంగ సెక్టార్లు అత్యధికంగా నష్టాలలో పయనించాయి. ఈ క్రమంలో సెన్సెక్ 723 పాయింట్లను కొల్పయి 26 వేల 717 పాయింట్ల వద్ద ట్రేడింగ్ సాగిస్తుండగా, నిఫ్టీ..228 పాయింట్లను కోల్పోయి 8 వేల 97 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలో ఒక్క భారతీ ఎయిర్ టెల్ సంస్థకు చెందిన షేర్లు మాత్రమే 0.81 శాతం లాభాన్ని ఆర్జించగా, బిహెచ్ఇఎల్, అంబుజా సిమెంట్స్, కోటక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, లార్సెన్, తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. మొత్తం 2397 కంపెనీల షేర్లు పాల్గోన్నగా వాటిలో 2143 కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. 158 సంస్థల షేర్లు లాభనష్టాల మథ్య తటస్థంగా వున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  

Other Articles