Sensex falls 644 pts from top after hitting 30k on rbi rate cut

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE, union budget 2015-16, Arun jaitley

Sensex falls 644 pts from top after hitting 30K on RBI rate cut

రికార్డు స్థాయికి చేరి.. నష్టాలతో ముగిసిన దేశీయ సూచీలు

Posted: 03/04/2015 06:49 PM IST
Sensex falls 644 pts from top after hitting 30k on rbi rate cut

భారతీయ రిజర్వు బ్యాంకు రెపో రేటును తగ్గించిన దరిమిలా ఉదయం లాభాలతో దూసుకెళ్లిన మార్కెట్లు ఆల్ టైం హైకి చేరి.. అనంతరం క్రమంగా నష్టాలతో ముగిశాయి. ఉదయాన్నే ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నిర్ణయాన్ని స్వాగతించిన మదుపుదారులు.. కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. దీంతో మార్కెట్లు మునుపెన్నడూ ఎరుగని ఉన్నత మార్కులకు చేరుకున్నాయి. సెన్సెక్స్ ముఫై వేల మార్కును తాకింది. అటు నిఫ్టీ కూడా కొత్త శిఖరాలను అందుకుంది. ఆ తరువాత విదేశీ మార్కట్ల నుంచి వచ్చిన ప్రతికూల వాతావరణాల నేపథ్యంలో మార్కెట్లు నష్టాలను చవిచూశాయి.

ముఖ్యంగా ఆసియా, యూరోఫ్ మార్కెట్లు ప్రతికూలంగా వుండటంతో దేశీయ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. గురువారం యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సమావేశం కానున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని వేచి చూస్తున్న మదుపరులు అమ్మకాలకు సంకల్పించారు. దీంతో 664 పాయింట్ల లాభాన్ని ఆర్జించిన సెన్సెక్స్ ఒక్కసారిగా 213 పాయింట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో 30030 పాయింట్ల మార్కుకు చేరుకున్న సెన్సెక్స్ చివరకు 29 వేల 381 పాయింట్ల వద్ద ముగిసింది.

అటు నిఫ్టీ కూడా 9096 పాయంట్ల మార్కును చేరుకున్న సెన్సెక్స్ కూడా చివరు 74 పాయింట్ల నష్టంతో 8 వేల 923 పాయింట్ల వద్ద ముగిసింది. ఎఫ్ఎంజీసీ, హెల్త్ కేర్ మినహా కాపిటల్ గూడ్స్, కన్యూమర్ డ్యూరెబుల్ గూడ్స్, ఐటీ, మెటెల్, ఆయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్, అటో సహా అన్ని సెక్టార్లు నష్టాలను ఎదుర్కోన్నాయి.  సన్ ఫార్మ, ఢీఎల్ఎఫ్, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, హెచ్ సీఎల్ టెక్ సంస్థల షేర్లు లాభాలలో పయనించగా, సీసా స్టెర్ లైట్, ఎన్ ఎం డీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హిండాల్కో, కామ్ ఇండియా తదితర సంస్థల షేర్లు నష్టాలను చవి చూశాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  

Other Articles