Private agricultural based industries focuses on making rice seeds

Private agricultural-based industries, private agro industries focuses on making rice seeds, agro industries focuses on making rice seeds, agro industries focuses on rice seeds, agro industries to develop rice seeds, india 3rd biggest market, india 3rd biggest market in rice production

Private agricultural-based corporations that focuses on making rice seeds as india is the 3rd biggest market in rice production

వరి వంగడాల విత్తన తయారీపై ప్రవేటు పరిశ్రమల దృష్టి

Posted: 12/18/2014 06:58 PM IST
Private agricultural based industries focuses on making rice seeds

మారుతున్న కాలంతో పాటు కర్షకులు కూడా మారుతున్నారు. వారిని అనుసరించి వాణిజ్యవేత్తలు కూడా మారుతున్నారు. ఇన్నాళ్లు కేవలం వాణిజ్య పంటల విత్తనాల్లో పలు రకాల వండగాల తయారీలో నిమగ్నమైన వ్యవసాయ అధారిత వాణిజ్య సంస్థలు ఇక వారి దృష్టిని మళ్లించాయి. ప్రభుత్వంతో పాలు ఎవరు ఎంతగా చెప్పినా.. రైతులు మాత్రం వరి పంటను వీడటం లేదు. తమకున్న భూమిలో కొంత వాణిజ్య పంటలకు కేటాయించినా మరికొంత మాత్రం వరికి కేటాయిస్తున్నరు. ఈ పరిణామాన్ని దీర్ఘకాలికంగా పరిశీలించిన తరువాత పరిగణలోకి తీసుకున్న సంస్థలు ఇప్పడు వరిలో పలురకాల మేలు రకం వండగాల తయారీపై దృష్టి సారించాయి. ఇప్పటికే నీరు అంతగా అవసరం లేని శ్రీ వరి వంటి వంగడాలను ఇక్రిసాట్ లాంటి అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు తయారు చేయడం వాటిని పలు ప్రాంతాల రైతులు వర్షాబావ ప్రాంతాల్లో పండించి పంటను ఆస్వాధించడంతో ప్రైవేటు రంగానికి చెందిన వ్యవసాయ అధారిత సంస్థలు కూడా ఇక వరిపై పరిశోధనలకు దృష్టి సారించాయి.

గతంతో పోల్చితే హైబ్రిడ్ వరి విత్తనాలను విత్తేందుకు రైతులు ఇటీవల కాలంలో ముందుకు రావటం కూడా ఇందుకు దోహదపడుతోంది. దీంతో ఇప్పటికే ఈ రంగంలో ఉన్న కంపెనీలు ఇంకా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తుంటే, మరికొన్ని కంపెనీలు కొత్తగా వరి విత్తన మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ విషయంలో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు ముందుండటం ప్రత్యేకత. పత్తి, మొక్కజొన్న విత్తనాల మార్కెట్ కంటే వరి విత్తన మార్కెట్లో అధిక వృద్ధి సాధించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి, అందువల్ల దీనిపై మేం దృష్టి పెట్టాం- అని హైదరాబాద్‌కు చెందిన విత్తన కంపెనీ ప్రతినిధి ఒకరు వివరించారు.

దేశీయ విత్తన విపణి పరిమాణం రూ.12,000 కోట్లకు పైనే ఉంటుందని అంచనా.  ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అమెరికా, చైనా తర్వాత స్ధానం మనదే. దీంతో ఇది ఏటా 15 శాతం వరకూ వృద్ధిని నమోదు చేస్తోంది. దీని ప్రకారం లెక్కిస్తే, వచ్చే అయిదేళ్లలో రూ.20,000 కోట్లకు మించిపోతుంది. వాణిజ్య పంటల విత్తనాల అమ్మకాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, గతంతో పోల్చితే వరి విత్తనాల అమ్మకాలు అధికం అవుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఇప్పటికే కొన్ని రకాలైన సంకర వరి వంగడాలను మార్కెట్లోకి విడుదల చేసిన సంస్థలు మరికొన్ని కొత్త రకాలను ఆవిష్కరించేందుకు ముమ్మర పరిశోధనలు చేస్తున్నాయి.

ముఖ్యంగా తుపాన్- అధిక వర్షపాతం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని తక్కువ రోజుల్లో చేతికి వచ్చే విధంగా అధిక దిగుబడి నిచ్చే వరి వంగడాలకు రైతుల నుంచి డిమాండ్ లభిస్తుందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వరిని అధికంగా పండించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు అగ్రస్ధానంలో ఉన్నాయి. ఇక్కడ ఎకరాకు సగటున 30-35 క్వింటాళ్ల కంటే అధికంగా ధాన్యం పండుతున్న దాఖలాలు లేవు. అదే కొన్ని ఆగ్నేయ ఆసియా దేశాల్లో 50-55 క్వింటాళ్ల వరకూ ధాన్యం పండుతోంది. అక్కడి వాతావరణ పరిస్థితులు, నేల లక్షణాలకు తోడు హైబ్రిడ్ విత్తనాల వినియోగం వల్ల అధిక దిగుబడి సాధ్యమవుతోంది. ఇదే విధంగా మనదేశంలోనూ ఇక్కడి భూసార, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వరి విత్తనాలను రూపొందించటానికి విత్తన కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

బేయర్ క్రాప్ సైన్సెస్ ఈ విభాగంలో గత కొంతకాలంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. నాలుగైదేళ్లుగా కావేరీ సీడ్ కంపెనీ కొత్త రకం హైబ్రిడ్ వరి విత్తనాల సృష్టికి పరిశోధనాలు చేస్తోంది. ఇదే విధంగా నూజివీడు సీడ్స్ వరి విత్తనాల రంగంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులకు అనువుగా కొన్ని హైబ్రీడ్ వరి వంగడాలను ఆవిష్కరించి మార్కెట్లో విక్రయిస్తోంది. మరికొన్ని మధ్యస్ధాయి కంపెనీలు ఇప్పుడు ఇదేబాటలో ముందుకు సాగుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  Rice seeds production  private firms  indian market  

Other Articles