First microsoft branded smartphone lumia 535 launched

smartphone, Windows Phone 8.1 with Lumia Denim, Lumia 535 sports, LED flash, 5MP front, rear cameras, 3G, Wi-Fi, Bluetooth 4.0, A-GPS,. colour options, 110 euros, China, Hong Kong, Bangladesh, India

First Microsoft-branded smartphone Lumia 535 launched

లుమియా 535 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్

Posted: 11/11/2014 06:12 PM IST
First microsoft branded smartphone lumia 535 launched

గత కొన్నాళ పాటు టీసర్లతో, లీకులతో సంచనాలకు కేంద్రబిందువుగా నిలిచిన సాఫ్ట్ వేర్ దిగ్గజం.. మైక్రోసాప్ట్ ఎట్టకేలకు తన లుమియా 535 స్మార్ట్ ఫోన్ ను అధికారికంగా విడుదల చేసింది. డ్యూయల్, సింగిల్ సిమ్ రెండు రకాలలోనూ ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. దీని ధరను 110 యూరోలుగా (పన్నులు, సబ్సీడీల రహితంగా భారత దేశ కరెన్సీ ప్రకారం రూ.8400) నిర్థారించారు. దీనిని కేవలం చైనా, హాంగ్ కాంగ్, బంగ్లాదేశ్ లలో మాత్రమే ప్రస్తుతం విక్రయించనున్నారు. భారత్ మార్కెట్లలోకి దీనిని ఎప్పడు ప్రవేశపెట్టనుంది, ఎంత ధరకు విక్రయించనున్నారన్న విషయాలను మైక్రోసాప్ట్ తెలియజేయలేదు.

లుమియా 530 ను సరిపోలినట్టుగానే లుమియా 535 వుందని, రెండింటికీ చివర్లలో గుండ్రని ఆకారాలున్నాయని, ఫోన్ వెనుక బాగం నలుపురంగుతో కవర్ అమర్చారని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. తొలిసారిగా నోకియా బ్రాండ్ లేకుండా మైక్రోసాప్ట్ బ్రాండ్ నేమ్ తో ఈ ఫోన్లు మార్కెట్లలోకి విడుదలయ్యాయి. నోకియా లుమియా 530లో వున్న పలు లోపాలను సవరించిన మైక్రోసాప్ట్.. లుమియా 535ను అవిష్కరించిందని వారు చెప్పారు. లూమియా 535లో 5 అంగుళాల క్యూ హెచ్ డీ ఐపీఎస్ ఎల్సీడి డిస్ ప్లే, 1.2 గిగాహెర్జ్స్ 200 క్వాడ్ ప్రాసెసర్, 1జీబి రామ్, 8 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు 128 ఎక్సటెండబుల్ మెమరీతో అకర్షనీయంగా తీర్చిదిద్దారు. 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమరా, వెనక ఎఈడీ ప్లాష్ లైట్ కూడా వుందని చెప్పారు.

లుమియా డెనిమ్ సాయంతో ఈ  ఫోన్ లో విండోస్ 8.1 సిస్టమ్ ను కూడా వినియోగించుకోవచ్చునని  చెప్పారు. ఈ ఫోణ్ 848-480 రిసోల్యూషన్ తో వీడియో షూటింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫోన్ 3జీ, వై ఫై, బ్లూటూత్, ఎ జీపీఎస్ తదితరాలను కనెక్టివిటీగా చేసుకుని వాడుకునే అవకాశం వుంది. క్యాన్, ముదురు ఆకుపచ్చ, ముదురు కాషయం, తెలుపు, డార్క్ గ్రే, బ్లాక్ వర్ణాలలో అందుబాటులో వుందని మైక్రోసాప్ట్ వర్గాలు తెలిపాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles