Samsung galaxy note 4 sales starts from 17 in india

samsung, galaxy note 4, sales, , india, 4 colours, 16 mp camera, 5.7 touch screen

samsung galaxy note 4 sales starts from 17 in india

17 నుంచి అందుబాటులోకి శాంసంగ్ గెలక్సీ నోట్ 4

Posted: 10/14/2014 04:40 PM IST
Samsung galaxy note 4 sales starts from 17 in india

ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో ప్రముఖ కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అందులోనూ స్మార్ట్ ఫోన్ల తయారీలో సంస్థల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా నెంబర్ టు స్థానాన్ని అక్రమించుకున్నప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ శాంసంగ్ నుండి మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఆపిల్ సంస్థతో పోటీ పడుతూ ఆ సంస్థ ఐ ఫోన్ 6, 6 ప్లస్ ప్రవేశపెట్టగానే పోటీగా శాంసంగ్ మరో మోడల్ ను మార్నెట్ లోకి ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ నెలలోనే సరికొత్త గెలాక్సీ నోట్ 4ను విడుదల చేసింది. అయితే గెలాక్సీ నోట్4 భారత్‌లో అక్టోబరు 17 నుంచి మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తుందని, దీని ధర రూ.58,300 అని సంస్థ తెలిపింది. యాపిల్ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లు భారత మార్కెట్‌లో అందుబాటులోకి వస్తున్న రోజునే గెలాక్సీ నోట్4 కూడా మార్కెట్‌లోకి రానుంది. 5.7 అంగుళాల స్ర్కీన్, 16 ఎంపీ కెమెరా, 3.7ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2.7గిగా హెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4.4 కిట్‌క్యాట్ ఓఎస్‌లతోపాటు చక్కని సెల్ఫీలు తీసుకోవడానికి ప్రత్యేక ఫీచర్లతో ప్రత్యేకంగా తీర్చిదిద్దబడింది. గెలాక్సీ నోట్4 ను నాలుగు విభిన్నమైన రంగుల్లో (చార్‌కోల్ బ్లాక్, ఫ్రాస్ట్ వైట్, బ్రాంజ్ గోల్డ్, బ్లాసమ్ పింక్) కొనుగోలుదార్లకు అందుబాటులోకి తీసుకురానుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samsung  galaxy note 4  sales  india  4 colours  16 mp camera  5.7 touch screen  

Other Articles