Us company to beam free wi fi to entire world from space

free Internet access, Internet data, outernet, United States

A US company is planning to build an 'Outernet - a global network of cube satellites broadcasting Internet data to all the people on the planet - for free.

ప్రపంచం అంతా ఫ్రీ ఇంటర్నెట్

Posted: 02/26/2014 04:14 PM IST
Us company to beam free wi fi to entire world from space

నిత్య జీవితంలో ఇంటర్నెట్ తప్పని సరి భాగం అయిపోయింది. ఇంటర్నెట్ ఇప్పుడు ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలో దర్శనం ఇస్తొంది. కానీ కొన్ని సందర్భాల్లో సముద్ర మార్గంలోనో, అడవిలోనో ప్రయాణిస్తుంటే అత్యవసరంగా ఇంటర్నెట్  అవసరం పడితే అధునాత టెక్నాలజీ వై-ఫై ద్వారా మన మొబైల్ లేక ల్యాప్ టాప్ ద్వారా కొంత ఛార్జీ చెల్లించి అవసర నిమిత్తం వాడుకుంటాం.

కానీ చెట్టూ, పుట్టా, సముద్రం అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే... ఏంటి ఇంటర్నెట్ ఫ్రీగా అది ప్రపంచ వ్యాప్తంగా... ఏంటి జోకులేస్తున్నానని అనుకుంటున్నారా ? నేనే చెప్పేది నిజం. అమెరికాకు చెందిన ‘మీడియా డెవలప్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఎండీఐఎఫ్)’ స్వచ్ఛంద సంస్థ ఆలోచన కార్యరూపం దాల్చితే ఇదంతా వాస్తవం కానుంది.

అంతరిక్షంలోకి కొన్ని వందల చిన్న కత్రిమ ఉపగ్రహాలను పంపి, వాటిని భూమిపై ఏర్పాటు చేసే గ్రౌండ్ స్టేషన్లకు అనుసంధానించే ‘ఔటర్‌నెట్’కు ఈ సంస్థ రూపకల్పన చేసింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం నిధులనూ సేకరిస్తోంది. వచ్చే ఏడాది కొన్ని చిన్న కత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది కూడా. ఈ ప్రాజెక్టుకు కొన్ని వేల కోట్ల రూపాయలు వ్యయమవుతాయని అంచనా. ఇది అందుబాటులోకి రావాలంటే మరికొన్నేళ్ళు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles