Reserve bank of india raises key interest rate

Reserve Bank of India, Raises Key Interest Rate, RBI,interest rates,Stock Markets, Raghuram Rajan, Rashika Rao, Upasna Bhardwaj

Reserve Bank of Indiaunexpectedly raised its policy interest rate by 25 basis pointson Friday but rolled-back some of the measures it hadimplemented to support the battered.

తొలి షాకిచ్చిన రాజన్

Posted: 09/20/2013 03:08 PM IST
Reserve bank of india raises key interest rate

ఆర్ బీఐ గవర్నర్ గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన రఘురామ్ రాజన్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ఆర్.బి.ఐ. పరపతి విధాన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఇవాళ్టి సమావేశంలో ఆర్బీఐ వడ్డీరేటు పెంచడమే కాకుండా,  బ్యాంకులకు ప్రామాణికంగా ఉండే రెపో రేటును 0.25 శాతం పెంచింది. పెంపు తర్వాత రెపోరేటు 7.5 శాతానికి చేరింది. దీంతో నిన్నటి వరకు కొత్త గవర్నర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి నిరాశే మిగిలింది. ఇప్పటికే సామాన్యులు అధిక వడ్డీ రేట్లతో అల్లాడి పోతున్నారు. వడ్డిరేట్లు తగ్లించాలని పలు మార్లు చెప్పిన వినిపించుకోకుండా పెంచేసింది. నగదు నిల్వల నిష్పత్తి యధాతంగా ఉంచి రెపో రేటు ను మాత్రం పెంచింది. ఆర్.బీ.ఐ. తీసుకున్న నిర్ణయంతో  స్టాక్‌ మార్కెట్లకు, పారిశ్రామిక రంగానికి, మధ్యతరగతి జనానికి భారీ షాక్ తగిలింది. రాజన్‌ నిర్ణయంతో సెన్సెక్స్‌ ఒక్కసారిగా 500ల పాయింట్లు పడింది. నిఫ్టీ 160 పాయింట్లు కోల్పోయింది.

తొలి షాకిచ్చిన రాజన్

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles