Sensex sinks 769 points as rupee breaches 62

Sensex sinks 769 points, BSE, Sensex, Nifty, Indian rupee

The rupee hit a record low of 62.03 in early trade today surpassing the previous all-time low of 61.80 hit last week. The currency had closed at 61.43 on Wednesday.

రూపాయి ధాటికి పడిన స్టాక్ మార్కెట్లు

Posted: 08/16/2013 04:50 PM IST
Sensex sinks 769 points as rupee breaches 62

అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి గణనీయంగా పతనం కావడంతో దాని ప్రభావం సెన్సెక్స్ మీద కూడా పడింది. సెన్సెక్స్ ఏకంగా 769.41 పాయింట్లు నష్టపోయి 18,598.18 వద్ద ముగిసింది.  శుక్రవారం నాటి మార్కెట్లో రూపాయి రికార్డు స్థాయి కనిష్ఠ విలువను నమోదు చేసుకుంది. తొలిసారి 62 రూపాయల కనిష్ఠాన్ని అధిగమించి సరికొత్తగా 62.03 చారిత్రాత్మక రికార్డును నమోదు చేసుకుంది. ఆగస్టు 6 తేదీన నమోదు చేసిన 61.80 రికార్డును శుక్రవారం తిరగరాసింది.  బుధవారం మార్కెట్లో రూపాయి 61.43 వద్ద ముగిసింది. ఆగస్టు 15 తేది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు కావడంతో గురువారం వ్యాపార లావాదేవీలు జరగలేదు. శుక్రవారం ఆరంభంలో రూపాయి క్రితం ముగింపునకు 10 పైసలు లాభపడింది. అయితే వెంటనే రూపాయి నష్టాల్లోకి జారుకుని చారిత్రాత్మక కనిష్ఠ స్థాయిని చేరుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles