Understanding between google ap government

ponnala laxmaiah, google, engineering, MOU, GOOGLE, cloud computing, mobile technology, training

MOU signed between Google and Andhra Pradesh government. The MOU is signed by Andhra Pradesh IT minister Ponnala Laxmaiah and Google vice president Nelson

విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ

Posted: 05/14/2013 07:04 PM IST
Understanding between google ap government

మన రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచితంగా క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ టెక్నాలజీలలో శిక్షణ ఇచ్చేందుకు ప్రముఖ సెర్చ్ ఇంజన్ దిగ్గజం అయిన గూగుల్ లో ఒప్పదం కుదుర్చుకుంది. ఈ కోర్సులలో ఇంజనీరింగ్ విద్యార్థులకు గూగుల్ ఉచితంగా శిక్షణ ఇస్తుందని మన ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్యయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన సచివాలయంలో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టోస్ కలిసి ఒప్పంద పత్రాల పై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ... ఇంజనీరింగ్ విద్యార్థులకు క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ సంస్థకు 20 ఎకరాల భూమిని అందించింది. ఐదు వేల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తొలుత ఇరవై ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన దాదాపు ముప్పై వేల మంది విద్యార్థులకు క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ టెక్నాలజీలో ఉచితంగా శిక్షణ ఇస్తారని తెలిపారు. విద్యార్థులు ఐటీ రంగంలో రాణించాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.... దేశంలోనే ప్రప్రథమంగా గూగుల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఈ విధమైన ఒప్పందం కుదుర్చుకుందని, నాణ్యమైన శిక్షణ గూగుల్ అందిస్తొందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles